Telangana Election Results 2023 : తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా…. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు పోస్టల్ బ్యాలెట్లలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ ఆదిక్యతను ప్రదర్శించింది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది.
మరోవైపు ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. మొదటి రౌండ్ల ఫలితాల్లో కాంగ్రెస్ కు పలు చోట్ల ఆదిక్యం లభించింది. మధిరలో మొదటి రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్కకు 2,098 ఓట్ల ఆధిక్యం దక్కింది. ఇక భద్రాచలం నియోజకవర్గం మొదటి రౌండ్‌లో 126 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి వీరయ్య ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గం మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ 6924 ఓట్ల ఆదిక్యంలో ఉంది. ఇక గజ్వేల్ లో కేసీఆర్ లీడ్ లో ఉన్నారు.
హైదరాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ ఆధిక్యం కనిపించగా… మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. దాదాపు 46 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉండగా… 11 చోట్ల మాత్రం బీఆర్ఎస్ ఆదిక్యం ప్రదర్శిస్తోంది.