Bandi Sanjay On CM: గుండు రాజకీయం, గాడిద గుడ్డు దుమారం..రేవంత్ Vs బండి సంజయ్
Bandi Sanjay On CM: పార్లమెంట్ ఎన్నికలవేళ రాజకీయ నేతల విమర్శలు దుమారం రేపుతున్నాయి. పరస్పర విమర్శలు...మాటల యుద్ధంతో జనం దృష్టిని ఆకర్షించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు.
Bandi Sanjay On CM:పదేళ్ళలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది ఏమి లేదని.. గాడిద గుడ్డు తప్ప చేసింది ఏమీ లేదని CM Revanth Reddy సీఎం రేవంత్ రెడ్డి జమ్మికుంట జనజాతర బహిరంగ సభ BJP బిజేపిని విమర్శించారు.
కరీంనగర్ Karimnagar, నిజామాబాద్ Nizamabad ఎంపీలు చేసింది గుండు సున్నా... అరగుండు, గుండు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. సీఎం వ్యాఖ్యలపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి Bandi Sanjay బండి సంజయ్ సీరియస్ గా స్పందించారు.
‘‘రేవంతన్నా... నేను 6 గ్యారంటీల సంగతేమైందని అడిగితే... గుండు, అరగుండ అంటూ హేళనగా మాట్లాడతవా? 5 ఏళ్లలో నేను చేసిన పోరాటాలు, కరీంనగర్ అభివృద్ధికి తెచ్చిన నిధులు నీ కళ్లకు కన్పించడం లేదా?’’అంటూ సంజయ్ ప్రశ్నించారు.
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వాడుతున్న భాషను చూసి జనం అసహ్యించు కుంటున్నారని విమర్శించారు. ‘‘మీరెన్ని డ్రామాలాడినా, ఎంతగా హేళన చేసినా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చే సీట్లు గుండు సున్నా’’అని ఎద్దేవా చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిరిసిల్ల లో బిజేపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సంజయ్, మీడియాతో మాట్లాడుతూ జమ్మికుంటలో నిర్వహించిన సీఎం జనజాతర బహిరంగ సభ అట్టర్ ఫ్లాఫ్ అయ్యిందని విమర్శించారు.
ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరిస్తున్నారనడానికి సబే నిదర్శనమన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతూ అసభ్య పదజాలంతో తిడుతూ ప్రజల దృష్టిలో మరింత చులకన అవుతున్నారని చెప్పారు.
నా గుండుతో పనేముంది?
సీఎంకు నా గుండుతో పనేంది? నాది అరగుండా? గుండా? అనేది నీకెందుకు? గాడిద గుడ్డు, అరగుండు, గుండు సున్నా అంటూ వ్యక్తిగతంగా కించపర్చడం సిగ్గు చేటన్నారు బండి సంజయ్. తెలంగాణలో నేను చేసిన పోరాటాలు, కరీంనగర్ లో నేను చేసిన పోరాటాలు కన్పించడం లేదా? నా గుండు మాత్రమే నీకు కన్పిస్తుందా అని ప్రశ్నించారు.
నువ్వెంత హేళన చేసినా పట్టిచుంకోను. ఆరు గ్యారంటీల సంగతి చెప్పని డిమాండ్ చేశారు. వంద రోజుల్లో మహిళల అకౌంట్లో ప్రతినెలా రూ.2500 లు ఇస్తానన్నవ్. ఏమిచ్చినవ్. గాడిద గుడ్డు, గుండు సున్నా. రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తానన్నవ్... ఏమిచ్చినవ్? గాడిద గుడ్డు, గుండు సున్నా తప్ప? వడ్లకు బోనస్ ఇస్తానన్నవ్? తులం బంగారం ఇస్తానన్నవ్? విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా ఇస్తానన్నవన్నారు.
వృద్దులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తానన్నావ్? ఏమిచ్చినవ్.. గాడిద గుడ్డు.. గుండు సున్నా... ఎన్నికల్లో మీ పార్టీకి వచ్చేది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. దమ్ముంటే 6 గ్యారంటీలపై చర్చించు. వాటిని ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే హామీలను అమలు చేయకపోవడంతో జనం తిరగబడుతున్నా కాంగ్రెస్ నేతలకు బుద్ది రావడం లేదని ఎద్దేవా చేశారు.
రేవంత్ కు దేవుడే దిక్కయ్యాడు
మేము శ్రీరాముడి గురించి మాట్లాడుతుంటే.. దేవుడి పేరు చెప్పుకోవడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్న రేవంత్ రెడ్డికి.. దేవుడి మీద ఓట్టేసి రుణమాఫీ చేస్తానంటున్నాడని చివరకు ఆయనకు దేవుడే దిక్కయ్యొడని సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ ది ద్వంద్వ విధానమని మైనారిటీ డిక్లరేషన్ పేరుతో ఒక వర్గం ఓట్లు దండుకుంటున్నారని ఆరోపించారు.
మీ లెక్క తెలంగాణ ఉద్యమం చేస్తానంటే తుపాకీతో కాల్చేస్తానని నేను అనలేదని... ఢిల్లీలో టియర్ గ్యాస్, వాటర్ వదిలినా వెనుకంజ వేయకుండా జై తెలంగాణ అని గర్జించి గాండ్రించిన నాయకుడిని నేను. ఎవరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా తెలంగాణలో అత్యధిక స్థానాలు బీజేపీ గెలవడం.. కరీంనగర్ లో భారీ మెజారిటీ ఘనవిజయం సాధించడం తథ్యమన్నారు.
(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, కరీంనగర్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం