Rajender Nagar MLA: కాంగ్రెస్‌లో చేరనున్న రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
Rajender Nagar MLA: బీఆర్‌ఎస్ పార్టీలో మరో వికెట్ పడింది. రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు.
Rajender Nagar MLA: రాజేందర్ నగర్ బీఆర్‌ఎస్ BRS ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ prakash goud కాంగ్రెస్ Congress పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో telangana కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, పార్లమెంటు ఎన్నికల తర్వాత కూలిపోతుందని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.
నెలరోజుల క్రితమే రాజేందర్‌నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. శుక్రవారం ఉదయం రేవంత్ రెడ్డితో భేటీ అయిన ప్రకాష్ గౌడ్, కాంగ్రెస్‌పార్టీలో చేరేందుకు సంసిద్ధత తెలిపారు. శనివారం అనుచరులతో కలిసి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది.
కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని హెచ్చరికలు చేయడంతో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రక్రియలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు పదేపదే వ్యాఖ్యలు చేస్తుడటంతో తాము గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్ ఖాళీ అవుతుందని రేవంత్ గతంలో వ్యాఖ్యానించారు. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడంతో పాటు బీఆర్‌ఎస్ నుంచి ముప్పు లేకుండా చూసుకునే పనిలో పడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బీఆర్‌ఎస్ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్ వంటి వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జడ్పీ ఛైర్మన్ పీఠాలు, మునిసిపల్ పీఠాలు కాంగ్రెస్ వశమయ్యాయి. జిల్లా స్థాయి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరికపై కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నా తాజాగా కొలిక్కి వచ్చింది. శనివారం అనుచరులతో కలిసి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
సంబంధిత కథనం