Hyderabad Mayor : కాంగ్రెస్ లో చేరిన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి-hyderabad mayor vijayalakshmi joined the congress party ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Hyderabad Mayor : కాంగ్రెస్ లో చేరిన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి

Hyderabad Mayor : కాంగ్రెస్ లో చేరిన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 30, 2024 12:46 PM IST

Hyderabad Mayor Vijayalakshmi : హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి… పార్టీ కండువా కప్పారు.

కాంగ్రెస్ లో చేరిన హైదరాబాద్ మేయర్
కాంగ్రెస్ లో చేరిన హైదరాబాద్ మేయర్

Hyderabad Mayor Vijayalakshmi : ఇటీవలే బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి కేకే కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి… ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సురేఖ ఉన్నారు. మరోవైపు మేయర్ తండ్రి కేకే కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో…. హస్తం కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ఆయన ప్రకటన కూడా చేశారు.

కే కేశవరావు(MP K Keshava Rao)… కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. అనేక పదవులు కూడా అనుభవించారు. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ తో కలిసి పని చేస్తూ వచ్చారు. పార్టీలో కూడా ఆయనకు అధికా ప్రాధాన్యత లభించింది. రెండుసార్లు ఎంపీగా(రాజ్యసభ) అవకాశం దక్కింది. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేతగా కూడా ఉన్నారు. మరోవైపు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న కేకే…. బీఆర్ఎస్ పార్టీలో కూడా సీనియర్ నేతగా మెలిగారు. ఓవైపు కేకే ఎంపీగా ఉండగానే… ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మీ(Hyderabad Mayor Vijayalakshmi) హైదరాబాద్ నగరంలో కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు. అయితే ఆమెకు మేయర్ స్థానాన్ని కట్టబెట్టింది బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధినాయకత్వం. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కావటంతో… పరిణామాలన్నీ మారిపోయాయి. కేవలం 39 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష పార్టీగా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ…. ఘర్ వాపసీ అంటోంది. అంతేకాదు ఆపరేషన్ ఆకర్ష్ తో నేతలను పార్టీలోకి రప్పిస్తోంది. ఇప్పటికే చాలా మంది నేతలను పార్టీలో చేర్చుకోగా… ఇటీవలే కేకేతో కూడా సంప్రదింపులు కూడా జరిపింది. ఈ నేపథ్యంలోనే…. కేకేతో పాటు ఆయన కుమార్తె…. హస్తం కండువా కప్పేసుకున్నారు.

బీఆర్ఎస్ లోనే కేకే కుమారుడు…

కేకేతో(MP K Keshava Rao) పాటు మేయర్ విజయలక్ష్మీ(Hyderabad Mayor Vijayalakshmi) కాంగ్రెస్ లో చేరగా… ఆయన కుమారుడు విప్లవ్ కుమార్ మాత్రం తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ సమయంలో కేకేతో పాటు సోదరి పార్టీ మారటం సరికాదని అభిప్రాయపడ్డారు. విజయలక్ష్మి ఏ పార్టీలోనైనా చేరవచ్చని… కానీ బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టిన మేయర్ పదవికి రాజీనామా చేయాలని అన్నారు. తాను మాత్రం… కేసీఆర్ తోనే ఉంటానని చెప్పుకొచ్చారు.

Whats_app_banner