KK Meets Revanth: తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డితో కేశవరావు, మేయర్‌ విజయలక్ష్మీ భేటీ… బిఆర్‌ఎస్‌ను వీడుతున్న నేతలు-brs mp kesava rao meets cm revanth reddy and joins in congress soon ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kk Meets Revanth: తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డితో కేశవరావు, మేయర్‌ విజయలక్ష్మీ భేటీ… బిఆర్‌ఎస్‌ను వీడుతున్న నేతలు

KK Meets Revanth: తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డితో కేశవరావు, మేయర్‌ విజయలక్ష్మీ భేటీ… బిఆర్‌ఎస్‌ను వీడుతున్న నేతలు

Sarath chandra.B HT Telugu
Mar 29, 2024 11:34 AM IST

KK Meets Revanth: బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేశవరావు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు కేశవరావు కుమార్తె స్పష్టత ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్‌తో భేటీ అయిన కేశవరావు, మేయర్ విజయలక్ష్మీ
ముఖ్యమంత్రి రేవంత్‌తో భేటీ అయిన కేశవరావు, మేయర్ విజయలక్ష్మీ

KK Meets Revanth: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఒక్కొక్కరిగా ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేశవరావు kesava rao ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో Revanth reddy భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్‌ మున్షీ, ఇతర ముఖ్య నాయకుల సమక్షంలో కేశవరావు ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. దాదాపు అరగంట పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి.

గురువారం పార్టీని వీడుతున్నట్లు కేశవరావు ప్రకటించారు. BRS బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో సమావేశమై పార్టీని వీడుతున్నట్లు వివరించారు. కేశవరావు వ్యవహారంపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. కేశవరావుతో పాటు ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కూడా కాంగ్రెస్‌ Congress గూటికి చేరుకోనున్నారు.

కేకేతో పాటు ఆయన కుమార్తె ఢిల్లీలో కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల సమక్షంలో కేకే పార్టీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డితో భేటీ సందర్భంగా పలు అంశాలపై చర్చలు జరిపారు.కేకేతో భేటీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు కడియం శ్రీహరి నివాసానికి వెళ్లారు.

బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతగా, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కే కేశవరావు(BRS MP K Keshava Rao)…. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ… కేశవ రావుతో పాటు ఆయన కుమార్తె, మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మార్పుపై విజయలక్ష్మీతో పాటు కేకే అప్పట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు.

పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో గురువారం సాయంత్రం కేశవరావు… కేసీఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కేకే నిర్ణయంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మార్చి 30వ తేదీన కేకే.. కాంగ్రెస్ లో చేరనున్నారు. కేకేతో పాటు ఆయన కుమార్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో పాటు పది మంది కార్పొరేటర్లు కూడా హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

కే కేశవరావు… కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అనేక పదవులు అనుభవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్న సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు.

టిఆర్‌ఎస్‌‌లో కీలక నేతగా ఎదిగారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచి కేసీఆర్ తో కలిసి పని చేస్తూ వచ్చారు. పార్టీలో కూడా ఆయనకు అధికా ప్రాధాన్యత లభించింది. రెండుసార్లు ఎంపీగా(రాజ్యసభ) అవకాశం దక్కింది. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేతగా కూడా ఉన్నారు. మరోవైపు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న కేకే…. బీఆర్ఎస్ పార్టీలో కూడా సీనియర్ నేతగా మెలిగారు.

కేసీఆర్‌ కుమార్తె గద్వాల విజయలక్ష్మీ హైదరాబాద్ నగరంలో కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మేయర్ స్థానాన్ని కట్టబెట్టింది. తే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కావటంతో… పరిణామాలన్నీ మారిపోయాయి. కేవలం 39 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష పార్టీగా ఉంది.

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీ గతంలో పార్టీని వీడిన వారిని ఘర్ వాపసీ అంటోంది. ఆపరేషన్ ఆకర్ష్ తో నేతలను పార్టీలోకి రప్పిస్తోంది. ఇప్పటికే చాలా మంది నేతలను పార్టీలో చేర్చుకోగా… ఇటీవలే కేకేతో కూడా సంప్రదింపులు కూడా జరిపింది.

Whats_app_banner

సంబంధిత కథనం