Assembly Election results 2023 : రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు!
Assembly Election results 2023 : రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఈ విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Assembly Election results 2023 : దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ముఖ్యంగా.. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల సరళి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మధ్యప్రదేశ్‌లో ఇలా..
Madhya Pradesh Assembly Election results 2023 : మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 116.
ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ.. 126 సీట్లల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 67 స్థానాల్లో లీడ్‌లో ఉంది.
బుద్నీ నుంచి పోటీ చేసిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. ముందంజలో ఉన్నారు.
ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో హంగ్ ఏర్పడటంతో హైఓల్టేజ్ రాజకీయాలు దర్శనమిచ్చాయి. ఈసారి ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.
ఛత్తీస్‌గఢ్‌లో ఇలా..
Chhattisgarh Assembly Election results 2023 : ఛత్తీస్‌గఢ్‌లో 90 సీట్లు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 46. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది.
ఎర్లీ ట్రెండ్స్‌లో కాంగ్రెస్ 29 సీట్లల్లో ముందంజలో ఉండగా.. బీజేపీ 42 చోట్ల, కాంగ్రెస్ 33 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి.
తెలంగాణ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రాజస్థాన్‌లో ఇలా..
Rajasthan Assembly Election results 2023 : రాజస్థాన్‌లో బీజేపీ- కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ 76 చోట్ల, కాంగ్రెస్ 73 స్థా
రాజస్థాన్‌లో మొత్తం 200 సీట్లు ఉండగా.. 199 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ గెలవాలంటే.. మెజారిటీ ఫిగర్ 100 దాటాల్సిందే. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ రాజస్థాన్ ప్రజలు.. దశాబ్దాలుగా.. ఏ పార్టీకి కూడా వరుసగా రెండోసారి అధికారన్ని కట్టబెట్టలేదు!
వాస్తవానికి మిజోరం ఎన్నికల ఫలితాలు కూడా నేడే వెలువడాల్సి ఉంది. కానీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సోమవారానికి వాయిదా వేశారు.
సంబంధిత కథనం