Jagan Attack Case: పోలీసుల అదుపులో సిఎం జగన్‌పై దాడి చేసిన యువకుడు.. ఫుట్‌పాత్ టైల్ ముక్కతో జగన్‌పై దాడి….
Jagan Attack Case: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకుడిగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Jagan Attack Case: ఏపీ సీఎం జగన్ Ys jaganపై రాయి దాడి Attack కేసు దర్యాప్తులో విజయవాడ పోలీసులు పురోగతి సాధించారు. దాదాపు 48గంటల తర్వాత ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి Suspected in Custody తీసుకున్నారు.
సింగ్‌నగర్ Singh Nagar ప్రాంతానికి చెందిన సతీష్ అనే యువకుడు జగన్‍పై రాయితో దాడి చేసినట్టు గుర్తించారు. అజిత్‍సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే యువకుడు ముఖ్యమంత్రిపై రాయి విసిరినట్టు గుర్తించారు. సతీష్‍తో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
మంగళవారం తెల్లవారుజామున సతీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు పదార్ధాలు సేవిస్తున్నందుకు తీసుకెళుతున్నట్టు పోలీసులు తమతో చెప్పారని నిందితుడి తల్లి తెలిపింది. ఆధార్ కార్డుతో పోలీస్ స్టేషన్‌కు రావాలని మాత్రమే తమతో చెప్పారని, అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా అక్కడ అచూకీ లేదని తెలిపారు. నిందితుడిని విజయవాడ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు తెలుస్తోంది.
దాడి జరిగిన సమయంలో నిందితుడితో పాటు ఉన్న ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్నా, సంతోష్ అనే యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నార. శనివారం రాత్రి 8.04నిమిషాలకు డాబా కొట్ల సెంటర్‌లో ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేశారు. ఈ దాడిలో సిఎం జగన్‌తో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి కంటికి గాయాలయ్యాయి. విసురుగా వచ్చిన రాయి నేరుగా సిఎం జగన్‌ను నుదుటిపై తాకింది.
రూఫ్‌టాప్ బస్సుపై ఉన్న సిఎంపై దాడి జరగడంపై విజయవాడ పోలీసులు దాదాపు 8 బృందాలతో దర్యాప్తు చేపట్టాయి. బస్సు యాత్ర సాగిన ప్రాంతంలో మొబైల్ టవర్ డంప్‌లను విశ్లేషించారు. చీకట్లో తీసిన వీడియోలు మినహా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నిందితుల ఆచూకీ చెబితే రెండు లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు.
ఫుట్‌పాత్‌లపై వేసే టైల్స్ ముక్కతో సిఎం జగన్‌పై దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు దాడి వెనుక ఉన్న కారణాలపై యువకులను ప్రశ్నిస్తున్నారు. గత మూడ్రోజులు ముఖ్యమంత్రిపై దాడి వ్యవహారం ఏపీలో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎన్నికల స్టంట్ అంటూ విపక్షాలు ఆరోపిస్తుంటే, ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.
దాదాపు 1480మంది పోలీసులతో సిఎం బస్సు యాత్ర కోసం పోలీసులు ఏర్పాటు చేసినా దాడి జరగకుండా నిరోధించలేకపోయారు. విజయవాడలో 22కి.మీ పొడవున యాత్రను నిర్వహించారు. సెంట్రల్ నియోజక వర్గంలో బస్సు యాత్ర సాగుతున్న సమయంలో దాడి జరిగింది. దాడి ఘటనతొో ముఖ్యమంత్రి జగన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర…
ఒకరోజు విరామం తర్వాత సోమవారం నుంచి ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్దం యాత్రలను కొనసాగిస్తున్నారు. దేవుడి దయతో తాను దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డానని సోమవారం కృష్ణా జిల్లాలో జరిగిన యాత్రలో సిఎం ప్రకటించారు. కంటికి, నుదుటికి తగలకుండా దేవుడు కాపాడినట్టు చెప్పారు.
మంగళవారం ఉదయం నారాయణపురం స్టే పాయింట్ వద్ద తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి బస్సుయాత్రలో పాల్గొంటున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో పలువురు కీలక నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి వైయస్సార్సీపీలోకి ముఖ్యమంత్రి ఆహ్వానించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ కీలక నేత (2019 గురజాల నియోజకవర్గం జనసేన అభ్యర్ధి) చింతలపూడి శ్రీనివాసరావు, డాక్టర్ అశోక్ కుమార్, దాచేపలి మండల జనసేన నేత మందపాటి దుర్గారావులు వైసీపీలో చేరారు.
తెలుగుదేశం పార్టీ నుంచి పిడుగురాళ్ల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు ఎన్.పేరయ్య, టీడీపీ సీనియర్ నేత గుంటుపల్లి రామారావు వైయస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్ధి పి అనిల్ కుమార్‌యాదవ్, మంత్రి కారుమూరి నాగేశ్వరరావులు పాల్గొన్నారు.
సంబంధిత కథనం