Pemmasani Chandrasekhar : ఏపీలో ఎన్నికల నామినేషన్(Election Nominations) ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్ లలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల కడప ఎంపీ స్థానానికి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేయగా...అఫిడవిట్ లో తన అన్న, సీఎం జగన్ కు రూ.82 కోట్లు బాకీ పడినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఆస్తుల ప్రకటన మరింత ఆసక్తికరంగా మారింది. గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్(TDP Pemmasani Chandrasekhar) పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయన నామినేషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులకు ప్రకటించారు పెమ్మసాని. అయితే ఆయన ఆస్తులపై ఆశ్చర్యకరమైన చర్చ జరుగుతోంది. పెమ్మసాని తనకు రూ.5,785 కోట్ల ఆస్తులు(Pemmasani Assets) ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో చరాస్తులు రూ.2,316 కోట్లు తన పేరిట, రూ.2,289 కోట్లు తన భార్య పేరిట ఉన్నట్లు వెల్లడించారు. తనకు రూ.519 కోట్లు అప్పు, తన భార్య శ్రీరత్నకు రూ. 519 కోట్లు అప్పులు ఉన్నాయని అఫిడవిట్ లో తెలిపారు. వీరిద్దరికీ చెరో రూ.1,200 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు చెప్పారు.
హైదరాబాద్(Hyderabad)లో 28.10 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములు, అమెరికా(America)లో రూ.6.82 కోట్ల విలువైన ల్యాండ్ ఉన్నట్లు పెమ్మసాని తెలిపారు. హైదరాబాద్‌లో రూ. 29.73 కోట్ల విలువైన కమర్షియల్ కాంప్లెక్స్, దిల్లీలో రూ.72 కోట్ల విలువైన బిల్డింగ్, తన భార్య పేరిట రూ.34.82 కోట్ల ఇల్లు, అమెరికాలో రూ.28. 26 కోట్ల విలువైన భవనాలు ఉన్నాయని పెమ్మసాని అఫిడవిట్(Pemmasani Affidavit)లో పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో రూ.2.67 కోట్ల విలువైన సాగుభూమి ఉందని తెలిపారు. అలాగే రెండు మెర్సిడైజ్ బెంజ్, టెస్లా, రోల్స్ రాయిస్, టయోటా పార్చుర్ కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.6.11 కోట్లు ఉందన్నారు. తన బ్యాంకు ఖాతాలో రూ.5.97 కోట్లు, తన భార్య బ్యాంకు ఖాతాల్లో రూ.5.90 కోట్లు ఉన్నాయన్నారు. తన భార్య పిల్లలకు కలిపి రూ.6.86 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొ్న్నారు. కృష్ణా జిల్లాలో తన భార్య శ్రీరత్న పేరిట 2.33 కోట్ల విలువైన సాగు భూమి ఉందన్నారు.
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishwar Reddy) నామినేషన్ దాఖలు చేశారు. తన ఆస్తుల విలువ రూ.4,568 కోట్లుగా విశ్వేశ్వర్ రెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్నారు. కొండా పేరు మీద రూ.1240 కోట్లు, అతని సతీమణి పేరుపై రూ.3,208 కోట్ల ఆస్తులు, కుమారుడి పేరు మీద రూ.108 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
సంబంధిత కథనం