Zaheer Khan on Team India X Factor: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాను గెలిపించేది ఆ బౌలరే: జహీర్ ఖాన్-zaheer khan on team india x factor in t20 world cup 2024 says shami will be key for the team chances ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Zaheer Khan On Team India X Factor: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాను గెలిపించేది ఆ బౌలరే: జహీర్ ఖాన్

Zaheer Khan on Team India X Factor: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాను గెలిపించేది ఆ బౌలరే: జహీర్ ఖాన్

Hari Prasad S HT Telugu
Jan 18, 2024 10:18 PM IST

Zaheer Khan on Team India X Factor: రాబోయే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున కీలకం కానున్న పేస్ బౌలర్ ఎవరో చెప్పాడు మాజీ ప్లేయర్ జహీర్ ఖాన్. ఈ ఏడాది జూన్ 1 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

జహీర్ ఖాన్
జహీర్ ఖాన్ (Getty Images)

Zaheer Khan on Team India X Factor: ఈ ఏడాది టీమిండియా మరో టీ20 వరల్డ్ కప్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీ టీమ్ ఎక్స్ ఫ్యాక్టర్ పై మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మెగా టోర్నీలో ఇండియన్ టీమ్ మహ్మద్ షమిని తీసుకుంటే బాగుంటుందంటూ నలుగురు పేస్ బౌలర్ల పేర్లను అతడు చెప్పాడు.

ఆఫ్ఘనిస్థాన్ తో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ తో టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా సిద్ధమైంది. అయితే ఈ సిరీస్ కు ప్రధాన పేస్ బౌలర్లయిన బుమ్రా, సిరాజ్ లేకుండానే ఇండియన్ టీమ్ బరిలోకి దిగింది. యువ పేస్ బౌలర్లు, స్పిన్నర్లు టీమ్ ను గెలిపించారు. కానీ వరల్డ్ కప్ కోసం ఇండియన్ టీమ్ ఎంపిక చేయాల్సిన పేస్ బౌలర్ల పేర్లను జహీర్ వెల్లడించాడు.

ఆ నలుగురే జట్టులో ఉండాలి: జహీర్

టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమ్ లోకి ఎంపిక చేయాల్సిన నలుగురి పేర్లను జహీర్ వెల్లడించాడు. అందులో షమి ఎక్స్ ఫ్యాక్టర్ ఆప్షన్ అవుతాడని కూడా అతడు అనడం విశేషం. కలర్స్ సినీప్లెతో అతడు మాట్లాడుతూ.. టీమ్ ఎంపికపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "బుమ్రా, సిరాజ్ కచ్చితంగా జట్టులో ఉంటారని నేను భావిస్తున్నాను.

వాళ్ల తర్వాత అర్ష్‌దీప్ రూపంలో కాస్త వేరియేషన్ లభిస్తుంది. అతడు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. మంచి యార్కర్లు వేస్తాడు. అది అదనపు లబ్ధి చేకూరుస్తుంది. ఆ తర్వాత షమి కీలకం. ఎందుకంటే అతడు ఫిట్ గా ఉండి అందుబాటులో ఉంటే.. ఎక్స్ ఫ్యాక్టర్ ఆప్షన్ అవుతాడు. అందువల్ల నేను ఈ నలుగురు పేస్ బౌర్లను కచ్చితంగా ఎంపిక చేస్తాను" అని జహీర్ అన్నాడు.

షమి గాయం సంగతేంటి?

గతేడాది వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన మహ్మద్ షమి.. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఆ మెగా టోర్నీలో 7 మ్యాచ్ లలోనే అతడు ఏకంగా 24 వికెట్లు తీశాడు. అంతేకాదు వరల్డ్ కప్ చరిత్రలో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా అతడే. అయితే ఈ టోర్నీ సందర్భంగా అతడు గాయపడ్డాడు.

తర్వాత సౌతాఫ్రికా సిరీస్ కోసం ఫిట్‌గా ఉంటే ఆడతాడని బీసీసీఐ చెప్పింది. కానీ అతడు అప్పటికి పూర్తిగా కోలుకోలేదు. దీంతో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ నుంచి అతన్ని తప్పించారు. గతేడాది జూన్ లో ఇండియా తరఫున షమి చివరి టెస్ట్ ఆడాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ సమయానికి కోలుకుంటే అతని పేరును పరిశీలించే అవకాశం ఉంది. అటు షమి కూడా వరల్డ్ కప్ ఆడేందుకు ఆసక్తి చూపించాడు.

మరోవైపు టీమిండియా టీ20 వరల్డ్ కప్ కు ముందు తన చివరి టీ20 సిరీస్ ఆఫ్ఘనిస్థాన్ తో ఆడేసింది. ఈ సిరీస్ క్లీన్ స్వీప్ చేసి మెగా టోర్నీకి సిద్ధమైంది. ఇప్పుడు ఇండియన్ ప్లేయర్స్.. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్, తర్వాత ఐపీఎల్ ఆడతారు. తర్వాత నేరుగా వరల్డ్ కప్ కోసం వెళ్తారు.

IPL_Entry_Point