World Cup 2023 Team of the Tournament: సగానికిపైగా టీమిండియా ప్లేయర్సే.. ఐసీసీ టీమ్ ఆఫ్ ద వరల్డ్ కప్ ఇదే
World Cup 2023 Team of the Tournament: ఐసీసీ టీమ్ ఆఫ్ ద వరల్డ్ కప్ అనౌన్స్ చేసింది. ఇందులో సగానికి పైగా టీమిండియా ప్లేయర్సే ఉండటం విశేషం.
World Cup 2023 Team of the Tournament: వరల్డ్ కప్ 2023 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ లో ఏకంగా ఆరుగురు ఇండియన్ ప్లేయర్స్ చోటు దక్కించుకోవడం విశేషం. ఫైనల్లో ఓడినా.. అంతకుముందు పది వరుస విజయాలతో ఇండియన్ టీమ్ టోర్నీ మొత్తాన్ని డామినేట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ టీమ్ ఆఫ్ ద టోర్నీలో ఇండియా ప్లేయర్సే ఎక్కువ మంది ఉన్నారు.
టీమిండియా కాకుండా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లకు చెందిన ప్లేయర్స్ ఈ వరల్డ్ కప్ 2023 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ లో చోటు దక్కించుకున్నారు. వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్ నుంచి ఇద్దరు ప్లేయర్స్, సెమీఫైనల్లో ఓడిన సౌతాఫ్రికా, న్యూజిలాండ్ నుంచి ఒక్కో ప్లేయర్, శ్రీలంకకు చెందిన ఒక ప్లేయర్ ఈ టీమ్ ఆఫ్ ద టోర్నీలో ఉన్నారు.
ఇండియా నుంచి కెప్టెన్ రోహిత్ తోపాటు కోహ్లి, రాహుల్, జడేజా, బుమ్రా, షమిలకు చోటు దక్కింది. ఈ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ను మాజీ క్రికెటర్లు ఇయాన్ బిషప్, షేన్ వాట్సన్, వసీం అక్రమ్, సునీల్ వైద్య (జర్నలిస్ట్)లతో కూడిన సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఐసీసీ ఈ టీమ్ ను అనౌన్స్ చేసింది. ఇండియా తరఫున ముగ్గుర బ్యాటర్లు, ఒక ఆల్ రౌండర్, ఇద్దరు బౌలర్లకు చోటు దక్కింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 టీమ్ ఆఫ్ ద టోర్నీ ఇదే
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్ - సౌతాఫ్రికా) - 594 రన్స్
రోహిత్ శర్మ (కెప్టెన్, ఇండియా) - 597 రన్స్
విరాట్ కోహ్లి (ఇండియా) - 765 రన్స్
డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) - 552 రన్స్
కేఎల్ రాహుల్ (ఇండియా) - 452 రన్స్
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) - 400 రన్స్, 6 వికెట్లు
రవీంద్ర జడేజా (ఇండియా) - 120 రన్స్, 16 వికెట్లు
బుమ్రా (ఇండియా) - 20 వికెట్లు
దిల్షాన్ మదుషంక (శ్రీలంక) - 21 వికెట్లు
ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) - 23 వికెట్లు
మహ్మద్ షమి (ఇండియా) - 24 వికెట్లు
12వప్లేయర్ - గెరాల్డ్ కోయెట్జీ (సౌతాఫ్రికా) - 20 వికెట్లు