Sreesanth to Gambhir: నువ్వు సుప్రీంకోర్టు కంటే గొప్పోడివా.. ఆ దేవుడు నిన్ను క్షమించడు: గంభీర్‌పై మండిపడిన శ్రీశాంత్-sreesanth to gambhir says you have exceeded the boundaries god will not forgive you ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sreesanth To Gambhir: నువ్వు సుప్రీంకోర్టు కంటే గొప్పోడివా.. ఆ దేవుడు నిన్ను క్షమించడు: గంభీర్‌పై మండిపడిన శ్రీశాంత్

Sreesanth to Gambhir: నువ్వు సుప్రీంకోర్టు కంటే గొప్పోడివా.. ఆ దేవుడు నిన్ను క్షమించడు: గంభీర్‌పై మండిపడిన శ్రీశాంత్

Hari Prasad S HT Telugu
Dec 07, 2023 09:21 PM IST

Sreesanth to Gambhir: గంభీర్, శ్రీశాంత్ మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా గంభీర్ చేసిన ఓ పోస్ట్ పై శ్రీశాంత్ చాలా తీవ్రంగా స్పందించాడు. నువ్వు సుప్రీంకోర్టు కంటే గొప్పోడివా.. ఆ దేవుడు నిన్ను క్షమించడు అంటూ మండిపడ్డాడు.

శ్రీశాంత్, గంభీర్ మధ్య ముదురుతున్న వివాదం
శ్రీశాంత్, గంభీర్ మధ్య ముదురుతున్న వివాదం

Sreesanth to Gambhir: లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో మొదలైన గంభీర్, శ్రీశాంత్ గొడవ ముదిరింది. తనను పదే పదే ఫిక్సర్ అని పిలిచాడంటూ శ్రీశాంత్ ఆరోపించిన తర్వాత గంభీర్ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. ప్రపంచమంతా అటెన్షన్ కోరుకుంటున్నప్పుడు నవ్వుతూ కనిపించాలి అనే క్యాప్షన్ తో తాను నవ్వుతున్న ఫొటోను షేర్ చేశాడు.

అయితే గంభీర్ చేసిన ఈ పోస్ట్ పై శ్రీశాంత్ ఓ పెద్ద కామెంట్ రాశాడు. అందులో గంభీర్ తీరును తప్పుబడుతూ తీవ్రంగా స్పందించాడు. నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడంటూ మండిపడ్డాడు. నీ మీద ఇన్నాళ్లూ ఉన్న గౌరవం పోయిందని స్పష్టం చేశాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..

"ఓ క్రీడాకారుడిగా, ఓ సోదరుడిగా నువ్వు అన్ని హద్దులూ దాటావు. అన్నింటి కంటే ముఖ్యంగా నువ్వు ప్రజా ప్రతినిధివి. అయినా ప్రతి క్రికెటర్ తో గొడవ పడతావు. అసలు నీకు ఏమైంది? నేను నవ్వానంతే. ఆ మాత్రం దానికే ఫిక్సర్ అంటావా? నువ్వు సుప్రీంకోర్టు కంటే గొప్పోడివా?

అలా మాట్లాడే హక్కు నీకు లేదు. అంపైర్లను కూడా తిట్టావు. అయినా నవ్వు గురించి మాట్లాడతావా? నువ్వో అహంకారివి. నీకు మద్దతిచ్చిన ఎవరినీ గౌరవించవు. నిన్నటి వరకూ నువ్వంటే గౌరవం ఉండేది. అయినా నన్ను నువ్వు ఫిక్స్ అంటూ ఒకసారి కూడా ఏడెనిమిదిసార్లు అన్నావు. ఎఫ్ వర్డ్ కూడా వాడావు. నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించావు.

నాలాంటి పరిస్థితిని అనుభవించిన వారు ఎవరూ నిన్ను క్షమించారు. నువ్వు తప్పు చేశావని నీకు కూడా తెలుసు. ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు. ఆ ఘటన తర్వాత నువ్వు ఫీల్డ్ లోకే రాలేదు. దేవుడు అన్నీ చూస్తున్నాడు" అని గంభీర్ పోస్టుపై శ్రీశాంత్ కామెంట్ చేశాడు.

శ్రీశాంత్ చేసిన పోస్ట్ పై కొన్ని వందల మంది స్పందించారు. కొందరు గంభీర్ కు మద్దతుగా, మరికొందరు శ్రీశాంత్ కు మద్దతు కామెంట్స్ చేయడం విశేషం. లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో వీళ్ల మధ్య మాటామాటా పెరిగి అది కాస్త పెద్ద వివాదంగా మారింది. ఈ ఇద్దరి ఘటనపై విచారణకు కూడా ఆదేశించినట్లు లెజెండ్స్ లీగ్ క్రికెట్ నిర్వాహకులు వెల్లడించారు.

Whats_app_banner