SA vs AFG Semifinal: సౌతాఫ్రికా పేసర్ల ధాటికి కుప్పకూలిన ఆఫ్ఘనిస్థాన్.. ఎక్స్‌ట్రాలే అత్యధిక స్కోరు.. వార్ వన్ సైడేనా?-south africa vs afghanistan jansen rabada nortje shamsi restricts afghans to mere 56 runs ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sa Vs Afg Semifinal: సౌతాఫ్రికా పేసర్ల ధాటికి కుప్పకూలిన ఆఫ్ఘనిస్థాన్.. ఎక్స్‌ట్రాలే అత్యధిక స్కోరు.. వార్ వన్ సైడేనా?

SA vs AFG Semifinal: సౌతాఫ్రికా పేసర్ల ధాటికి కుప్పకూలిన ఆఫ్ఘనిస్థాన్.. ఎక్స్‌ట్రాలే అత్యధిక స్కోరు.. వార్ వన్ సైడేనా?

Hari Prasad S HT Telugu
Jun 27, 2024 07:26 AM IST

SA vs AFG Semifinal: సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. సౌతాఫ్రికా పేసర్ల ధాటికి తట్టుకోలేక కేవలం 56 పరుగులకే కుప్పకూలడంతో ఇక వార్ వన్ సైడే అని అర్థమవుతోంది.

సౌతాఫ్రికా పేసర్ల ధాటికి కుప్పకూలిన ఆఫ్ఘనిస్థాన్.. ఎక్స్‌ట్రాలే అత్యధిక స్కోరు.. వార్ వన్ సైడేనా?
సౌతాఫ్రికా పేసర్ల ధాటికి కుప్పకూలిన ఆఫ్ఘనిస్థాన్.. ఎక్స్‌ట్రాలే అత్యధిక స్కోరు.. వార్ వన్ సైడేనా? (AP)

SA vs AFG Semifinal: ఓ వరల్డ్ కప్ సెమీఫైనల్లో తొలిసారి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్స్, అక్కడి క్రికెట్ అభిమానుల ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. లీగ్ స్టేజ్ లో న్యూజిలాండ్, సూపర్ 8లో ఆస్ట్రేలియాలాంటి జట్లను ఓడించి సంచలనం సృష్టించిన ఆఫ్ఘనిస్థాన్.. సెమీఫైనల్లో సౌతాఫ్రికా బౌలర్ల ముందు నిలవలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసి కేవలం 56 పరుగులకే కుప్పకూలింది.

ఎక్స్‌ట్రాలే అత్యధిక స్కోరు

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి ఓవర్లో మొదలైన వాళ్ల వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. సఫారీ పేసర్లు యాన్సెన్, రబాడా, నోక్యా, స్పిన్నర్ షంసిల నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఆఫ్ఘన్ బ్యాటర్లకు చుక్కలు కనిపించాయి. దీంతో కేవలం 11.5 ఓవర్లలోనే 56 పరుగులకు చేతులెత్తేసింది.

సఫారీ బౌలర్ల జోరు

సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ 3, షంసి 3, రబాడా, నోక్యా చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ల ఇన్నింగ్స్ లో ఎక్స్‌ట్రాలే అత్యధిక స్కోరు కావడం విశేషం. సౌతాఫ్రికా బౌలర్లు 13 అదనపు పరుగులు ఇచ్చారు. ఇక అబ్దుల్లా ఒమర్జాయ్ మాత్రమే రెండంకెల స్కోరు అంటే 10 పరుగులు చేశాడు. మిగతా ఏ బ్యాటర్ కూడా 9 పరుగులు దాటలేకపోయారు.

గుర్బాజ్ (0), ఇబ్రహీం జద్రాన్ (2), గుల్బదీన్ నాయిబ్ (9), మహ్మద్ నబీ (0), ఖరోటే (2), కరీం జానత్ (8), రషీద్ ఖాన్ (8).. ఇలా అందరూ చేతులెత్తేశారు. తొలి ఓవర్లో 4 పరుగుల దగ్గర మొదలైన వికెట్ల పతనం.. మూడో ఓవర్ నుంచి దాదాపు ప్రతి ఓవర్ కొనసాగింది. నాలుగో ఓవర్లో, పదో ఓవర్లో రెండేసి వికెట్లు కోల్పోయింది. యాన్సెన్ 3 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.

ఇక స్పిన్నర్ షంసి కూడా 1.5 ఓవర్లలోనే కేవలం 6 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. రబాడా 3 ఓవర్లలో 14 పరుగులకే 2 వికెట్లు, నోక్యా 3 ఓవర్లలో 7 పరుగులకే 2 వికెట్లు తీశారు.

Whats_app_banner