IPL 2025: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లుగా ధోనీతో పాటు రిటైన్‌కు ఛాన్స్ ఉన్న సీనియర్ క్రికెటర్లు ఎవరంటే?
IPL 2025: ఐపీఎల్ 2025లో ధోనీ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ గా బరిలో దిగనున్నాడు. ఐపీఎల్ వేలంలో ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ కోటాలో సీఎస్‌కే రిటైన్ చేసుకోనున్నది. ధోనీతో పాటు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ కోటాలో రిటైన్‌కు అవకాశం ఉన్న క్రికెటర్లు ఎవరంటే?
IPL 2025:ఐపీఎల్ 2025లో ధోనీ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల గా బరిలో దిగనున్నాడు. టీమిండియాకు రిటైర్‌మెంట్ ప్రకటించి ఐదేళ్లు దాటిన క్రికెటర్లను అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లుగా ఇటీవలే ఐపీఎల్ పాలక మండలి ప్రకటించింది. ఈ వెసులుబాటు ఇండియన్ క్రికెటర్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ కొత్త రూల్ కారణంగా ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ కోటాలో ఐపీఎల్ వేలంలో సీఎస్‌కే దక్కించుకున్నాడు.
రెమ్యునరేషన్‌లో కోత...
అన్‌క్యాపడ్ ప్లేయర్ రూల్ కారణంగా ధోనీ రెమ్యునరేషన్‌లో భారీగా కోత పడనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ రిటైనింగ్ కొత్త రూల్ కారణంగా ఒక్కో టీమ్ ఆరుగురు క్రికెటర్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఆరుగురిలో ఇద్దరు మాత్రమే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ఉండాలని పేర్కొన్నది. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల కోసం గరిష్టంగా నాలుగు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాలని ఐపీఎల్ రూల్ పెట్టింది.ఈ రూల్ ప్రకారం ధోనీని చెన్నై నాలుగు కోట్లకు మాత్రమే రిటైన్ చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
2024లో 12 కోట్లు....
ఐపీఎల్ 2024 కోసం ధోనీ 12 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ రూల్ కారణంగా ఐపీఎల్ 2025లో ధోనీ ఎనమిది కోట్ల మేర నష్టపోనున్నాడు.అయితే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ కోటాలో ధోనీతో పాటు మరికొందరు సీనియర్ క్రికెటర్లను ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సీరియర్ ప్లేయర్లు అందరూ బౌలర్లు కావడం గమనార్హం.
సందీప్ శర్మ...
సందీప్ శర్మ టీమిండియాకు ఆది పదేళ్లు దాటిపోయింది. ఐపీఎల్‌లో మాత్రం ఈ పేసర్ అదరగొడుతోన్నాయి. . ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున బరిలో దిగిన సందీప్ శర్మ 13 వికెట్లతో రాణించాడు. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ అయిన సందీప్ శర్మను పంజాబ్ రిటైన్ చేసుకునే అవకాశం ఉంది.
పీయూష్ శర్మ...
టీమిండియా తరఫున పీయూష్ చావ్లాకు పెద్దగా ఆడే అవకాశాలు రాలేదు. కానీ ఐపీఎల్‌లో మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. 2024 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ నుంచి హయ్యెస్ట్ వికెట్లు తీసుకున్న బౌలర్‌గా పీయూష్ చావ్లా నిలిచాడు. 13 వికెట్లు దక్కించుకున్నాడు. సందీప్ శర్మను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పీయూష్ చావ్లాతో పాటు మరో స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ కోటాలో రిటైన్ అయ్యే అవకాశాలు కనిపిస్తోన్నాయి. అమిత్ మిశ్రాకు ఉన్న అనుభవం దృష్ట్యా ఈ ఏడాది కూడా జట్టులో అతడిని కొనసాగించాలని లక్నో సూపర్ జాయింట్స్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది.