Rohit Sharma On Ashwin: వరల్డ్ కప్ టీమ్‌లో అశ్విన్ - రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ ఆన్సర్
Rohit Sharma On Ashwin: సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వరల్డ్ కప్ టీమ్‌లో ఉంటాడా? లేదా? అన్న ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర సమాధానం చెప్పాడు. అశ్విన్ జట్టులో ఉండే అవకాశాల్ని కొట్టిపారేయలేమని రోహిత్ శర్మ తెలిపాడు.
Rohit Sharma On Ashwin: వన్డే వరల్డ్ కప్ టీమ్‌లోకి అశ్విన్‌ను తీసుకుంటారా? లేదా? అన్నది కొన్నాళ్లుగా క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అక్టోబర్‌లో మొదలుకానున్న వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో అశ్విన్ కు స్థానం దక్కలేదు. ఆసియా కప్‌లో అక్షర్ పటేల్ గాయపడటంతో అతడి స్థానాన్ని అశ్విన్‌తో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం దాదాపు ఏడాదిన్నర తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన అశ్విన్ బౌలింగ్‌లో రాణించాడు. తొలి వన్డేలో ఒక వికెట్, రెండో వన్డేలో మూడు వికెట్లు తీసుకున్నాడు. అతడిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. మూడో వన్డేకు ముందు రోహిత్ పాత్రికేయులతో ముచ్చటించాడు. ఇందులో వరల్డ్ కప్ టీమ్‌లో అశ్విన్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయా అని పాత్రికేయుల అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ ఆసక్తికర సమాధానం చెప్పాడు.
“అశ్విన్ క్లాస్ బౌలర్. ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కొంటూ బౌలింగ్ చేయగలిగిన సామర్థ్యాలు, అనుభవం అతడికి ఉన్నాయి. వన్డే క్రికెట్‌కు దూరంగా ఉన్నంత మాత్రం అతడి అనుభవం పనికిరాకుండా పోదు. ఆటకు గ్యాప్ వచ్చినా అతడి బౌలింగ్‌లో పదును, క్లాస్ తగ్గలేదు. అశ్విన్ బౌలింగ్‌లోని వేరియేషన్స్‌ను అర్థం చేసుకోవడం బ్యాట్స్‌మెన్స్‌కు కష్టం” అని రోహిత్ శర్మ చెప్పాడు. అశ్విన్‌ను వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకునే అవకాశాల్ని కొట్టిపారేయలేమని రోహిత్ శర్మ చెప్పాడు.
చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చునని తెలిపాడు. వరల్డ్ కప్ కోసం చాలా మంది ఆటగాళ్లను బ్యాకప్ కోసం సిద్ధంగా పెట్టుకుంటున్నామని, వారందరికి తగినంత ప్రాక్టీస్ కల్పించడంపైనేఫోకస్‌పెడుతున్నామని రోహిత్ శర్మ చెప్పాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేలకు దూరంగా ఉన్నా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి...బుధవారం రాజ్‌కోట్‌లో జరుగుతోన్న మూడో వన్డేతో టీమ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. వరల్డ్ కప్‌కు ముందు టీమ్ ఇండియా ఆడనున్న చివరి అంతర్జాతీయ వన్డే ఇదే కావడం గమనార్హం.