Rohit Sharma: పాకిస్థాన్ మ్యాచ్‌లో సచిన్ అరుదైన రికార్డులపై కన్నేసిన రోహిత్
Rohit Sharma: ఆసియా కప్‌లో తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమీండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిపైనే టీమీండియా ఫ్యాన్స్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్ ద్వారా పలు అరుదైన రికార్డులపై రోహిత్ శర్మ కన్నేశాడు. ఆ రికార్డులు ఏవంటే..
Rohit Sharma: ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో నేడు (శనివారం) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమీండియా తలపడనుంది. దాయాది దేశాల మధ్య పోరు క్రికెట్ అభిమానుల మధ్య ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో టీమీండియా క్రికెట్ ఫ్యాన్స్ దృష్టి ఎక్కువగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపైనే ఉంది.
పాకిస్థాన్‌పై ఈ ఇద్దరు సీనియర్ల ఘనమైన ట్రాక్ రికార్డ్ ఉంది. పాకిస్థాన్‌తో జరిగిన పోరులో చాలా సార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చెలరేగి ఆడుతూ టీమ్ ఇండియాకు విజయాల్ని తెచ్చిపెట్టారు. నేటి మ్యాచ్‌లో కోహ్లితో పాటు రోహిత్ ఎలా ఆడుతా డన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పలు అరుదైన రికార్డ్‌లపై రోహిత్, కన్నేశాడు.ఆ రికార్డులు ఏవంటే...
సచిన్ రికార్డ్‌ను రోహిత్ బ్రేక్ చేస్తాడా?
ఆసియా కప్ వన్డే ఫార్మెట్‌లో టీమ్ ఇండియా తరఫున లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు చేశాడు. ఇరవై మూడు మ్యాచ్‌లలో సచిన్ 971 రన్స్ చేశాడు. అతడి తర్వాత 745 రన్స్‌తో రోహిత్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు.
ఈ ఆసియా కప్‌లో రోహిత్ మరో 226 రన్స్ చేస్తే సచిన్ రికార్డ్‌ను అధిగమించి ఆసియా కప్‌లో అత్యధిక రన్స్ చేసిన ఇండియన్ క్రికెటర్‌గా నిలుస్తాడు. ఓవరాల్‌గా ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా శ్రీలంక బ్యాట్స్‌మెన్ సనత్ జయసూర్య (1220 రన్స్) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.
హాఫ్ సెంచరీస్ రికార్డ్...
ఆసియా కప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన టీమ్ ఇండియా క్రికెటర్ల జాబితాలో సచిన్ (8 హాఫ్ సెంచరీలు)లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా...ఏడు హాఫ్ సెంచరీలతో రోహిత్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. మరో హాఫ్ సెంచరీ చేస్తే సచిన్ రికార్డ్‌ను రోహిత్ సమం చేస్తాడు.
అలాగే ఆసియా కప్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డుకు మరో సిక్స్ దూరంలోనే రోహిత్ ఉన్నాడు. ఈ జాబితాలో 18 సిక్సర్లతో రైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా రోహిత్ 17 సిక్సర్లతో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.