Rinku Singh: 100 మీటర్ల దూరంలో భారీ సిక్సర్.. అసలు సీక్రెట్ చెప్పిన రింకూ సింగ్
Rinku Singh About 100 Meter Sixer: రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన రింకూ సింగ్ తను బాదిన 100 మీటర్ల సిక్సర్‌పై అసలు సీక్రెట్ తెలిపాడు.
IND vs AUS 4th T20 Highlights: భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో (T20 Series 2023) టీమిండియా దుమ్ములేపింది. మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకునే దిశలో ఉన్న భారత్ తాజాగా నాలుగో మ్యాచ్ కూడా గెలిచింది. రాయ్‌పూర్ వేదికగా జరిగిన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో తొలుతు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 9 వికెట్లకు 174 పరుగులు చేసింది.
టీమిండియా బ్యాటింగ్‌లో రింకూ సింగ్ హైలెట్‌గా నిలిచాడు. తన బ్యాటింగ్‌తో సత్తా చాటుతున్న రింకూ సింగ్ మరోసారి దమ్మురేపాడు. భారత్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌లో 29 బంతులు ఎదుర్కొన్న రింకూ సింగ్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 రన్స్ చేశాడు. శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్ వంటి కీలక బ్యాట్స్‌మెన్ వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ 174 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే, ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ బాదిన ఓ సిక్సర్ ఏకంగా 100 మీటర్ల దూరం వెళ్లింది. దీంతో ఈ టీ20 సిరీస్‌లో భారీ సిక్సర్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు రింకూ సింగ్. మ్యాచ్ ముగిసిన తర్వాత తన పవర్ హిట్ సిక్సర్‌కు గల సీక్రెట్‌ను బయటపెట్టాడు రింకూ సింగ్. మ్యాచ్ తర్వాత బీసీసీఐ టీవీతో రింకూ సింగ్, జితేష్ శర్మ మాట్లాడారు. ఈ క్రమంలోనే నీ పవర్ హిట్టింగ్‌కు (సిక్సర్) గల కారణం ఏంటని జితేష్ ప్రశ్నించాడు.
"నేను నీతో (జితేష్ శర్మ) కలిసి జిమ్ చేస్తున్నాను. మంచి ఫుడ్ తీసుకుంటున్నాను. బరువులు ఎత్తడం కూడా నాకు ఇష్టం. అందుకే సహజంగానే నాలో అంత పవర్ ఉంది" అని నవ్వుతూ రింకూ సింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ ఓడిపోయింది.