India vs Pakistan: తుదిజట్టును ప్రకటించిన పాకిస్థాన్.. వారిపై నమ్మకం ఉందన్న బాబర్ ఆజమ్.. టీమిండియా ఎలా ఉండొచ్చంటే..-pakistan announces final xi for match against india in asia cup 2023 super fours ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Pakistan: తుదిజట్టును ప్రకటించిన పాకిస్థాన్.. వారిపై నమ్మకం ఉందన్న బాబర్ ఆజమ్.. టీమిండియా ఎలా ఉండొచ్చంటే..

India vs Pakistan: తుదిజట్టును ప్రకటించిన పాకిస్థాన్.. వారిపై నమ్మకం ఉందన్న బాబర్ ఆజమ్.. టీమిండియా ఎలా ఉండొచ్చంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 09, 2023 11:19 PM IST

India vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆదివారం (సెప్టెంబర్ 10) మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‍కు ఒక్క రోజు ముందే తుదిజట్టును పాకిస్థాన్ ప్రకటించింది.

India vs Pakistan: తుదిజట్టును ప్రకటించిన పాకిస్థాన్.. వారిపై నమ్మకం ఉందన్న బాబర్ ఆజమ్
India vs Pakistan: తుదిజట్టును ప్రకటించిన పాకిస్థాన్.. వారిపై నమ్మకం ఉందన్న బాబర్ ఆజమ్ (AP)

India vs Pakistan: ఆసియాకప్ 2023 టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ మరోసారి తలపడేందుకు రెడీ అయ్యాయి. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా భారత్, పాక్ మధ్య ఆదివారం (సెప్టెంబర్ 10) శ్రీలంకలోని కొలంబోలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‍కు వర్షం ముప్పు ఉండటంతో.. తదుపరి రోజును రిజర్వ్ డేగా ఇచ్చింది ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ). ఒకవేళ ఆదివారం వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే సోమవారం కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఆదివారం జరిగే ఈ ఇండియా, పాక్ క్రికెట్ యుద్ధం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇండియాతో మ్యాచ్‍కు ఒక్క రోజు ముందే పాకిస్థాన్ తమ తుదిజట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్‍తో ఆడిన జట్టుతోనే ఎలాంటి మార్పులు లేకుండా భారత్‍తోనూ పాకిస్థాన్ బరిలోకి దిగనుంది. విన్నింగ్ కాంబినేషన్‍నే కొనసాగించింది. దీంతో మహమ్మద్ నవాజ్ ఈ మ్యాచ్‍కు రీ-ఎంట్రీ ఇవ్వడం లేదు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‍రౌండర్ ఫహీమ్ అష్రఫ్.. ఇండియాతో మ్యాచ్‍లో పాక్ తుది జట్టులో ఉన్నాడు. కొలంబో పిచ్ బౌలింగ్‍కు అనుకూలిస్తుందనే అంచనాతో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, తమ పేసర్లు షహిన్ షా అఫ్రిది, హరిస్ రవూఫ్, నసీమ్ షాపై తనకు పూర్తి నమ్మకం ఉందని, మళ్లీ అదరగొడతాడని ప్రెస్ కాన్ఫరెన్సులో బాబర్ ఆజమ్ అన్నాడు.

“నేను మా పేసర్ల పట్ల గర్వంగా ఉన్నా. మేం అందరిపై ఆధిపత్యం చెలాయించాం. ముఖ్యమైన మ్యాచ్‍లను, టోర్నీమెంట్‍లను మా బౌలర్లు గెలిపించారు. నాకు వారిపై పూర్తి నమ్మకం ఉంది” అని బాబర్ ఆజమ్ చెప్పాడు.

వర్షం అనేది తమ చేతుల్లో లేదని, నియంత్రణలో ఉన్న విషయాల గురించే తాను ఆలోచిస్తానని బాబర్ చెప్పాడు. తమ పూర్తి సామర్థ్యం మేరకు ఆడతామని అన్నాడు. అలాగే, ఇండియాతో మ్యాచ్‍కు తుది జట్టును పాకిస్థాన్ ప్రకటించింది.

ఇండియాతో మ్యాచ్‍కు పాకిస్థాన్ తుదిజట్టు: ఫకర్ జమాన్, ఇమాముల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘ సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షహీన్ షా అఫ్రిదీ, నసీమ్ షా, హరిస్ రవూఫ్

పాకిస్థాన్‍తో మ్యాచ్‍లో టీమిండియాలో ఆల్ రౌండర్‌ శార్దూల్ ఠాకూర్‌కు తుదిజట్టులో చోటు దక్కుతుందా లేక షమీని తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. వికెట్ కీపర్‌గా ఫుల్ ఫామ్‍లో ఉన్న ఇషాన్ కిషన్‍ను కొనసాగించాలా.. లేక పూర్తి ఫిట్‍నెస్ సాధించిన కేఎల్ రాహుల్‍ను తీసుకోవాలా అనేది టీమిండియా మేనేజ్‍మెంట్ డైలమాలో ఉంది.

భారత తుదిజట్టు (అంచనా): శుభ్‍మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ / ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్‍దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్

భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఆదివారం (సెప్టెంబర్ 10) మధ్యాహ్నం 3 గంటలకు మొదలుకానుంది.

ఆసియాకప్‍లో గ్రూప్ స్టేజ్‍ సెప్టెంబర్ 2న భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి. అయితే, టీమిండియా తొలుత బ్యాటింగ్ చేశాక భారీ వర్షం పడటంతో ఆ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది.

Whats_app_banner