MI Playoffs:టైటిల్ విన్నర్ అనుకుంటే అందరికన్న ముందే అస్సాం ట్రైన్ ఎక్కారు- ముంబైకి ఇంకా ప్లేఆఫ్స్ ఛాన్సెస్ ఉన్నాయా?
MI Playoffs: కోల్‌కతాపై ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరుకునే దారులు దాదాపు మూసుకుపోయాయి. ముంబై ప్లేఆఫ్స్‌కు చేరాలంటే అద్భుతమే జరగాలి. ప్లేఆఫ్స్‌కు ముంబై చేరాలంటే ఏం జరగాలంటే?
MI Playoffs: కోల్‌కతాచేతిలో ఓటమితో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫ్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు క్లోజ్ అయ్యాయి. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో బౌలర్లు రాణించినా బ్యాట్స్‌మెన్స్ చేతులెత్తేయడంతో ముంబై చిన్న టార్గెట్‌ను ఛేజ్ చేయలేక చతికిలాపడింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో కోల్‌కతా ప్లేఆఫ్స్ రేసుకు మరింత చేరువ కాగా...ముంబై దారులు దాదాపు మూసుకుపోయాయి.
మూడు విజయాలు మాత్రమే...
ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన ముంబై ఎనిమిదింటిలో ఓడిపోయింది. కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించి పాయింట్స్ టేబుల్‌లో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరట్లుగా క్రికెట్ విశ్లేషకులు ముంబైతో పాటు ఆర్‌సీబీని కూడా పేర్కొన్నారు. కానీ ఈ రెండు జట్లు పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానాల్లో ఉన్నాయి. ఐపీఎల్ ప్రారంభానికి ముందు రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ అప్పగిస్తూ మేనేజ్‌మెంట్ షాకింగ్ డెసిషన్ తీసుకోవడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత రెండు సీజన్స్‌లో గుజరాత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్య ఓ సారి విన్నర్‌గా...మరోసారి రన్నరప్‌గా జట్టును నిలిపాడు.
కెప్టెన్‌గా ఫెయిల్...
దాంతో పాండ్య కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఈ సారి కప్పు గెలుస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ వారు అనుకున్నది ఒకటి అయితే రిజల్ట్ మాత్రం మరోలా వచ్చింది. పాండ్య కెప్టెన్సీలోనే కాకుండా బ్యాటర్‌గా, బౌలర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. జట్టును సమిష్టిగా ముందుకు నడిపించలేకపోయాడు. దాంతో పాండ్య కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. మిగిలిన మ్యాచుల్లోనైనా పాండ్యను పక్కనపెట్టి రోహిత్‌కు కెప్టెన్సీ అప్పగించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తోన్నారు.
ప్లేఆఫ్స్ ఛాన్సెస్...
కోల్‌కతాపై ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం దాదాపు అసాధ్యంగా తేలిపోయింది. ఏదో అద్భుతమే జరిగితే తప్పితే ముంబై లీగ్ దశలోనే ఇంటికి చేరడం ఖాయమైపోయింది. లీగ్ స్టేజ్‌లో ఇండియన్స్‌కు ఇంకో మూడు మ్యాచులు మాత్రమే మిగిలున్నాయి.
సన్‌రైజర్స్, కోల్‌కతాతో పాటు లక్నోతో మ్యచ్‌లు ఆడాల్సి వుంది. ఈ మూడింటిలో విజయం సాధిస్తే ముంబై పాయింట్స్ 12కు చేరుకుంటాయి.ఈ మూడు మ్యాచుల్లో రికార్డ్ రన్‌రేట్‌తో హార్డిక్ సేన గెలవాలి. కానీ అది అంత ఈజీ కాదు. లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం పన్నెండు పాయింట్స్‌తో ఉన్నాయి. తమ తదుపరి మ్యాచుల్లో ఒక్కటి కూడా ఈ టీమ్‌లు గెలవకూడదు. సీఎస్‌కే, ఢిల్లీతో పాటు పంజాబ్ కూడా 12 పాయింట్లకు పరిమితమైనే రన్ రేట్ ప్రకారం ముంబై ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది.
ప్లేఆఫ్స్‌కు రాజస్థాన్...
ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో 16 పాయింట్స్ సాధించి టాప్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. 14 పాయింట్లతో కోల్‌కతా ప్లేఆఫ్స్ బెర్తుకు ఓ అడుగు దూరంలో ఉంది. మూడు నాలుగు స్థానాల కోసం గట్టి పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది.