KL Rahul As RCB Captain: ఆర్సీబీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? ఐపీఎల్ 2025 కంటే ముందే!-kl rahul leaves lsg before ipl 2025 season and will be the rcb captain over issue with sanjiv goenka ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kl Rahul As Rcb Captain: ఆర్సీబీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? ఐపీఎల్ 2025 కంటే ముందే!

KL Rahul As RCB Captain: ఆర్సీబీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? ఐపీఎల్ 2025 కంటే ముందే!

Sanjiv Kumar HT Telugu
Jul 21, 2024 11:20 AM IST

KL Rahul Leaves LSG Before IPL 2025 Season: ఇండియన్ క్రికెట్ టీమ్ పాపులర్ ప్లేయర్ కేఎల్ ఆర్సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడని తెలుస్తోంది. ఐపీఎల్ 2025 కంటే ముందుగానే లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌ను వీడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వెళ్లనున్నాడని టాక్.

ఆర్సీబీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? ఐపీఎల్ 2025 కంటే ముందే!
ఆర్సీబీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? ఐపీఎల్ 2025 కంటే ముందే!

KL Rahul Captain To RCB In IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ప్రారంభానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఐపీఎల్ మెగా వేలానికి హాజరుకానుండగా.. టోర్నమెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రతి ఫ్రాంచైజీకి రిటెన్షన్ నిబంధనలను ఇంకా ఖరారు చేయలేదు.

ముదిరిన వివాదం

అయితే, దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకాతో రాహుల్ వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 మ్యాచ్‌ సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో దారుణంగా ఓడిపోయింది. అప్పుడు గ్రౌండ్‌లోనే రాహుల్‌పై సంజీవ్ అరిచేశాడు. రాహుల్ ఏదో చెబుతున్న వినకుండా అలాగే సంజీవ్ తిట్టాడు. అప్పుడే లక్నో టీమ్‌కు రాహుల్ వీడ్కోలు చెబుతుడానే క్రికెట్ ఫ్యాన్స్‌లో అనుమానం మొదలైంది.

ఆర్సీబీతో ఎంట్రీ

ఇప్పుడు కేఎల్ రాహుల్ ఎల్‌ఎస్‌జీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అది కూడా 2025 ఐపీఎల్ సీజన్ కంటే ముందుగానే వేరే జట్టులోకి మారనున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్ తనను పరిచయం చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి మారాలని చూస్తున్నట్లు సమాచారం. 2013లో కేఎల్ రాహుల్‌ను ఆర్సీబీ పరిచయం చేసింది. 2016లో కూడా ఆర్సీబీ తరఫున ఆడిన కేఎల్ రాహుల్ మంచి ప్రదర్శన చూపాడు.

కోహ్లీతో ఓపెనింగ్

ఆ తర్వాత 2017లో గాయం కారణంగా దూరమయ్యాడు. అనంతరం పంజాబ్ జట్టులో చేరాడు కేఎల్ రాహుల్. ఇప్పుడు మళ్లీ ఆర్సీబీ జట్టులోకే కేఎల్ రాహుల్ చేరనున్నట్లు టాక్ జోరుగా నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫాఫ్ డూప్లెసిస్ స్థానంలో ఆర్సీబీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దాంతో విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ సైతం ఉన్నాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గాయం కారణంగా

ఇదిలా ఉంటే, కర్ణాటక స్టే‌ట్‍కు చెందిన కేఎల్ రాహుల్ 2013లో ఆర్సీబీ తరఫున ఆడి వికెట్ కీపర్, బ్యాటర్‌గా సత్తా చాటాడు. అనంతరం 2014, 2015 సీజన్స్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ బాగానే ప్రదర్శన చూపాడు. మళ్లీ 2016లో ఆర్సీబీలోకి చేరి 2017లో గాయం కారణంగా దూరమయ్యాడు. 2018 నుంచి 2021 వరకు పంజాబ్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.

రెండేళ్లు ప్లే ఆఫ్స్‌కు

2022 నుంచి ఎల్ఎస్‌జీ జట్టు తరఫున ఆడటం ప్రారంభించాడు కేఎల్ రాహుల్. వరుసగా రెండేళ్లు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. అయితే, ఐపీఎల్ 2024లో మాత్రం లీగ్ దశ నుంచే ఎల్‌ఎస్‌జీ నిష్క్రమించిన విషయం తెలిసిందే.

Whats_app_banner