Virat Kohli Cars : విరాట్ కోహ్లీ దగ్గర చాలా కార్లు.. కానీ అనుష్కతో వెళ్లేది మాత్రం ఈ ఒక్క కారులోనే!
Virat Kohli Cars Collection : ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2024లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన విరాట్ వద్ద చాలా కార్లు ఉన్నాయి. కానీ కోహ్లీ అనుష్కతో ప్రయాణంలో ఒక ప్రత్యేక మోడల్‌ను మాత్రమే ఉపయోగిస్తాడు. కోహ్లీ కార్ల కలెక్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2024 టీ20 ప్రపంచకప్ గెలిచింది టీమిండియా. దీంతో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి రౌండ్లోనే మూడు భారీ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీ20 ప్రపంచకప్ చివరి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బ్యాట్ అద్భుతంగా ఆడింది. పరుగులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. 76 పరుగులు చేసి.. జట్టుకు కష్ట సమయంలో అండగా ఉన్నాడు. ఫలితంగా భారత జట్టు స్కోరు 176కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ మ్యాచ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇక ఆ విషయం పక్కన పెడితే విరాట్ కోహ్లీకి కార్లు అంటే ఇష్టముంది. విరాట్ కోహ్లీకి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అందుకే అతడి దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆడి, బిఎమ్‌డబ్ల్యూ వంటి అనేక లగ్జరీ కార్లతో అనేక కార్లు ఉన్నాయి. విరాట్ దగ్గర ఉన్న కార్ల గురించి తెలుసుకుందాం.. అనుష్కతో ఏ కారులో బయటకు వెళ్తాడో చూద్దాం..
ఆడి
విరాట్ కోహ్లీ కార్ల కలెక్షన్‌లో ఆడి ఆర్8 ఎల్ఎమ్ఎక్స్ అత్యంత వేగవంతమైన కారు. ఈ కారు ఖరీదు సుమారు రూ.2.72 కోట్లు. ఇందులో 5.2 లీటర్ వీ10 ఇంజన్ కలదు. ఇది కేవలం కొన్ని సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 320 కి.మీ.
బెంట్లీ కాంటినెంటల్ జీటీ, ఫ్లయింగ్ స్పర్
2018లో విరాట్ తన కార్ల కలెక్షన్లలో బెంట్లీ కాంటినెంటల్ జీటీని తీసుకొచ్చాడు. ఇది విలాసవంతమైన స్పోర్ట్స్ కారు. దీనిని కోహ్లీ తరచుగా దిల్లీ నడుపుతాడు. రూ.3.29 కోట్ల ప్రారంభ ధర కలిగిన ఈ కారు ఆయన కార్లన్నింటిలోకెల్లా అత్యంత ఖరీదైనది.
2019లో విరాట్ బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ కారును కొనుగోలు చేశాడు. ముంబైలోని విమానాశ్రయానికి వెళ్లేందుకు తరచూ ఈ కారును ఉపయోగిస్తుంటాడు. ఫ్లయింగ్ స్పర్ ఒక గొప్ప మోడల్. దాని ఆరవ గేర్ లో 333 కిలోమీటర్లను సులభంగా చేరుకుంటుంది.
రేంజ్ రోవర్ వోగ్
విరాట్ కారు కలెక్షన్ లో అద్భుతమైన వైట్ రేంజ్ రోవర్ కూడా ఉంది. ఈ కారు 335 బ్రేక్ హార్స్ పవర్ (బిహెచ్‌పీ), 740 న్యూటన్ మీటర్ల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.9 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. విరాట్ తరచూ తన భార్య అనుష్క శర్మతో కలిసి ఈ కారులో ప్రయాణిస్తూ ఉంటాడు. ఎక్కువగా వారిద్దరూ ఈ కారులోనే తిరుగుతారు.
రెనాల్ట్ డస్టర్
శ్రీలంకలో జరిగిన ఆసియా కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీకి రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీని ఇచ్చారు. ఆ వన్డే సిరీస్ లో 5 మ్యాచ్ ల్లో 74.00 సగటుతో 296 పరుగులు చేశాడు.
టయోటా ఫార్చ్యూనర్
టయోటా కిర్లోస్కర్ ఇండియా తన బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లీని నియమించుకుంది. ఆ తర్వాత విరాట్‌కు ఫార్చ్యూనర్ కూడా లభించింది.