Hardik Pandya: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ - హార్దిక్ పాండ్య రీఎంట్రీ - సన్‌రైజర్స్ స్టార్‌కు ఛాన్స్?
Hardik Pandya : బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి నిచ్చి ఐపీఎల్ స్టార్లను బరిలోకి దించాలని బీసీసీఐ భావిస్తోన్నట్లు సమాచారం. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, సాయిసుదర్శన్‌లకు ఈ టీ20 సిరీస్‌లో ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Hardik Pandya : బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల ఆనంతరం టీమిండియా ఈ జట్టుతోనే టీ20 సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుంచి మొదలుకానుంది. ఈ టీ20 సిరీస్ కోసం యంగ్ ప్లేయర్లతో కూడిన జట్టును సెలెక్ట్ చేసేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. టెస్ట్ సిరీస్ ఆడుతోన్న రిషబ్‌పంత్, కేఎల్ రాహుల్, గిల్‌తో పాటు బుమ్రా, సిరాజ్‌లకు టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.
సూర్యకుమార్ కెప్టెన్...
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతడికే సారథ్య బాధ్యతలు అప్పగించాలని సెలెక్టర్లు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అలాగే ఈ టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్య కూడా అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ ఆడలేదు హార్దిక్ పాండ్య. బంగ్లాదేశ్ సిరీస్‌తోనే దాదాపు మూడు నెలల లాంగ్ గ్యాప్ తర్వాత అతడు బరిలోకి దిగనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ముగ్గురిలో ఎవరు?
మరోవైపు బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు వికెట్ కీపర్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేన్ శర్మతోపాటు ఇషాన్ కిషన్ పోటీపడుతోన్నారు. ఈ ముగ్గురిలో సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాకాశాలు ఎక్కువగా కనిపిస్తోన్నాయి. సెకండ్ వికెట్ కీపర్‌గా జితేన్ శర్మ పేరు వినిపిస్తోంది. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలనే ఇషాన్ కిషన్ కల నెరవేరడానికి మరికొంత టైమ్ పట్టేలా ఉందని అంటున్నారు.
అభిషేక్ శర్మ రీఎంట్రీ...
జింబాబ్వే సిరీస్‌లో ఫాస్టెస్ట్ సెంచరీతో అదరగొట్టిన ఐపీఎల్ స్టార్, సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మను బంగ్లాదేశ్ సిరీస్ ఆడటం ఖాయంగానే కనిపిస్తోంది. అతడికి మరో ఛాన్స్ ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తోన్నట్లు సమాచారం. అభిషేక్ శర్మతో పాటు ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన రింకూ సింగ్, రియాన్ పరాగ్, సాయిసుదర్శన్‌లకు బంగ్లాదేశ్ సిరీస్‌లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
ముగ్గురు పేసర్లు...
ఈ టీ20 సిరీస్‌కు ముగ్గురు పేసర్ల పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తోన్నట్లు సమాచారం. అర్షదీప్‌సింగ్, ఖలీల్ అహ్మద్‌తో పాటు ఆవేశ్‌ఖాన్‌లను ఎంపికచేయనున్నట్లుతెలుస్తోంది. స్పిన్ కోటాలో రవి బిష్ణోయ్‌తో అక్షర్ పటేల్ ఛాన్స్ దక్కించుకోన్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టు అంచనా..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్ధిక్ పాండ్య, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, సంజూ శాంసన్, జితేన్ శర్మ, రింకు సింగ్, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్‌సింగ్, రవి బిష్టోయ్, అర్షదీప్ సింగ్.
అక్టోబర్ 6న ఫస్ట్ టీ20 మ్యాచ్...
అక్టోబర్ 6న ఇండియా, బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ గ్వాలియర్ వేదికగా జరుగనుంది. రెండో టీ20 మ్యాచ్ అక్టోబర్ 9న, మూడో టీ20 మ్యాచ్ అక్టోబర్ 12న జరుగనుంది. కాగా రెండు మ్యాచ్‌ల టెస్ట్‌సిరీస్‌లో తొలి టెస్ట్‌లో విజయం టీమిండియా విజయం సాధించింది. సెప్టెంబర్ 27 శుక్రవారం నుంచి రెండో టెస్ట్ మొదలుకానుంది.