Ind vs Eng 1st Test Day 3: ఇండియా ఆలౌట్.. 190 పరుగుల ఆధిక్యం.. మూడో రోజు టెస్ట్ మ్యాచ్ హైలెట్స్ ఇవే!
India vs England 1st Test Day 3 Score: ఇంగ్లండ్‌తో హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో మూడో రోజు ఇండియా ఆలౌట్ అయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో అక్ష్ పటేల్ బౌల్డ్ కావడంతో పదో వికెట్ కోల్పోయింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ స్కోర్ 436 పరుగులుగా ఉంది.
Ind vs Eng 1st Test Day 3 Highlights: హైదరాబాద్‌లో జరిగిన టెస్టులో రెండో రోజు టీమిండియా చెలరేగి ఆడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 421 రన్స్ చేసి 175 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆ సమయంలో జడేజా 81, అక్షర్ పటేల్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక మూడో రోజు (జనవరి 27) అక్షర్ పటేల్, జడేజాతో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. అప్పుడు 112 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 423 పరుగుల వద్ద భారత్ ఉంది.
లెగ్ బిఫోర్ వికెట్
118వ ఓవర్ ఆరో బాల్‌కు అక్షర్ పటేల్ ఒక బౌండరీ దాటించి అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. అనంతరం 119.3వ ఓవర్‌లో జో రూట్ వేసిన బాల్‌కు లెగ్ బిఫోర్ వికెట్‌గా రవీంద్ర జడేజా వెనుదిరిగాడు. దాంతో 87 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ ముగిసిపోయింది. అనంతరం అతడి రవీంద్ర జడేజా స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ పట్టి క్రీజులోకి వచ్చాడు. అయితే క్రీజ్‌లోకి వచ్చిన వెంటనే జస్‌ప్రీత్ బుమ్రా ఔట్ అయిపోయాడు.
పదో వికెట్‌గా అక్షర్
119 ఓవర్‌లో మూడో బాల్‌కు రవీంద్ర జడేజా లెగ్ బిఫోర్ వికెట్‌గా ఔట్ కాగా.. నాలుగో బాల్‌కే జస్‌ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగాడు. జో రూట్ వేసిన మరో మ్యాజిక్ బాల్‌తో జస్‌ప్రీత్ బుమ్రా ఔట్ అయి పెవిలియిన్ చేరాడు. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇలా టీమిండియా వెనువెంటనే 8వ, 9వ వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. అయితే, తర్వాత అక్షర్ పటేల్ కూడా వెనుదిరగాల్సి వచ్చింది.
15 పరుగులు మాత్రమే
120 ఓవర్‌లో ఆరో బాల్ వద్ద అక్షర్ పటేల్ కూడా బౌల్డ్ అయ్యాడు. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా పదో వికెట్‌ను కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇలా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 121 ఓవర్లలో 436 పరుగులు చేసింది. అంటే మూడో రోజు టీమిండియా బ్యాటర్స్ కేవలం 15 పరుగులను మాత్రమే జోడించారు. వీరిలో జస్‌ప్రీత్ బుమ్రా డకౌట్ అయ్యాడు.
190 పరుగుల ఆధిక్యం
మూడో రోజు టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండు వికెట్స్ తీయగా.. రెహాన్ అహ్మద్ ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తంగా టీమిండియా 190 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంగ్లాండ్-భారత్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు హైలెట్స్ చూస్తే.. 7 వికెట్ల నష్టానికి భారత్ 421 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (86), జడేజా అర్థ సెంచరీలు చేశారు. మూడో రోజు ఆటలో జడేజా 87 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.
అదరగొట్టిన అక్షర్ పటేల్
ఇదిలా ఉంటే రెండో రోజు శుక్రవారం (జనవరి 26) ఆటలో చివరి ఓవర్ చివరి మూడు బంతులకు అక్షర్ పటేల్ వరుసగా ఫోర్, సిక్స్, ఫోర్ కొట్టడం విశేషం. అప్పటివరకు అక్షర్ పటేల్, జడేజా కలిసి ఎనిమిదో వికెట్‌కు 63 పరుగులు జోడించారు.