IND vs ENG 1st Test: మూడో రోజు ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టిన అశ్విన్, బుమ్రా - ఓలీ పోప్ సెంచరీ - ఇంగ్లాండ్ ఆధిక్యం 126
IND vs ENG 1st Test: మూడో రోజు ఇంగ్లాండ్‌ను ఓలీ పోప్ ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను సెంచరీతో గట్టెక్కించాడు.
IND vs ENG 1st Test: ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న ఫస్ట్ టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను అశ్విన్, బుమ్రా దెబ్బకొట్టారు. ఓలీ పోప్ సెంచరీతో ఇంగ్లాండ్ తడబడి నిలబడింది. మూడో రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు నష్టపోయి 316 పరుగుల చేసింది. 163 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను ఓలీ పోప్ ఆదుకున్నాడు. 148 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడితో పాటు రెహాన్ అహ్మద్ పదహారు పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 126 పరుగుల ఆధిక్యంలో ఉంది.
బుమ్రా , అశ్విన్ జోరు....
190 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్‌ను ఆరంభంలోనే అశ్విన్ దెబ్బకొట్టాడు. 45 పరుగుల స్కోరు వద్ద ఓపెనర్ క్రాలీని ఔట్ చేశాడు. ధాటిగా ఆడిన క్రాలీ 33 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ను డకెట్, ఓలీ పోప్ ఆదుకున్నారు. ఈ జోడి రెండో వికెట్‌కు అరవై ఎనిమిది పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీకి చేరువ అవుతోన్న డకెట్‌ను బుమ్రా పెవిలియన్‌కు పంపించాడు. 47 పరుగుల వద్ద డకెట్ బోల్డయ్యాడు.
ఐదు వికెట్లు...
ఆ తర్వాత ఇంగ్లాండ్ చకా చకా వికెట్లను కోల్పోయింది. సీనియర్లు రూట్, బెయిర్ స్టోతో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు. బెన్ స్టోన్స్‌ను అశ్విన్ ఔట్ చేయగా...బెయిర్ స్టో వికెట్ జడేజాకు దక్కింది. రూట్‌ను బుమ్రా ఓట్ చేశాడు. ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లాండ్‌ను ఓలీ పోప్ అదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతోన్న ఒంటరి పోరాటంతో గట్టెక్కించాడు. వికెట్ కీపర్ బెన్ ఫోక్స్‌తో కలిసి ఇంగ్లాండ్ స్కోరును 250 పరుగులు ధాటించాడు. 34 పరుగలతో క్రీజులో పాతుకుపోయిన బెన్ ఫోక్స్‌ను అక్షర్ ఔట్ చేశాడు.
ఓలీ పోప్ సెంచరీ...
ఓవైపు వికెట్లు పడుతోన్న పట్టుదలతో క్రీజులో పాతుకుపోయిన ఓలీ పోప్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. సెంచరీ తర్వాత జోరు పెంచాడు ఓలీపోప్. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 208 బాల్స్‌లో 17 ఫోర్లతో 148 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్, జడేజా తలో రెండు వికెట్లు తీసుకోగా..జడేజా, అక్షర్ లకు ఒక్కో వికెట్ దక్కింది. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఫస్ట్ సెషన్‌లోనే ఇంగ్లాండ్‌ను ఔట్ చేస్తేనే టీమిండియా పట్టు బిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 436 పరుగులు చేసింది. జడేజా 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 86, యశస్వి జైస్వాల్ 80 పరుగులు చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 246 రన్స్ చేసింది.
టాపిక్