IND vs AUS World Cup Final Toss: ఇండియా ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ ఫైనల్ సమరం మొదలైంది. అహ్మదాబాద్ వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకున్నది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగింది. ఆస్ట్రేలియా కూడా తుది జట్టులో మార్పులు చేయలేదు. సిరాజ్ స్థానంలో అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ లో జట్టు కూర్పు దెబ్బ తినకూడదని టీమిండియా మేనేజ్ మెంట్ మార్పులు చేయనట్లుగా కనిపిస్తోంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, జడేజా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, షమీ, బుమ్రా
డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీస్, ప్యాట్ కమిన్స్, స్టార్క్, ఆడమ్ జంపా, హెజిల్‌వుడ్