IND vs AFG 1st T20: రోహిత్‌పైనే ఫోకస్ - తొలి టీ20లో పరుగుల వరద ఖాయమేనా?
IND vs AFG 1st T20: గురువారం (నేడు)అప్ఘనిస్థాన్‌తో జరుగనున్న తొలి టీ20 ద్వారా రోహిత్ శర్మ టీమిండియా తరఫున టీ20ల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. నేటి మ్యాచ్‌లో తుది జట్టులో స్థానం దక్కించుకునే అవకాశం ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఎవరంటే?
IND vs AFG 1st T20: ఇండియా, ఆప్ఘనిస్థాన్ మధ్య గురువారం (నేడు)తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. మొహాలీ వేదికగా ఈ మ్యాచ్ జరుగనున్న ఈ మ్యాచ్ ద్వారా దాదాపు ఏడాదిన్నర తర్వాత రోహిత్ టీమిండియా తరఫున టీ20ల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా ఈ మ్యాచ్ ఆడాల్సింది. కానీ వ్యక్తిగత కారణాలతో కోహ్లి తప్పుకున్నాడు. దాంతో రోహిత్ ఒక్కడే ఈ మ్యాచ్ ఆడనున్నాడు.
యశస్వితో ఓపెనింగ్...
నేటి మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడీగా బరిలో దిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. నేటి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆడతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ గిల్‌కు ఛాన్స్ ఇస్తే అతడు మూడో స్థానంలో ఆడనున్నట్లు తెలుస్తోంది. . టీమిండియాకు గాయలబెడద ఇబ్బంది పెడుతోంది. గాయల కారణంగా అప్ఘనిస్థాన్‌తో సిరీస్‌కు హిట్టర్లు హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యారు. దాంతో మిడిల్ ఆర్డర్ బలహీనంగా మారింది. కోహ్లి కూడా దూరం కావడంతో మిడిల్ ఆర్డర్ ప్లేస్‌ను ఎవరితో భర్తీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
తిలక్ వర్మకు ఛాన్స్...
తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకు ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్ స్థానం కోసం సంజూ శాంసన్‌కు కొత్త ప్లేయర్ జితేష్ శర్మ నుంచి గట్టి పోటీ నెలకొంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లలో జితేన్ శర్మ హిట్టింగ్ చేయడంతో తొలి టీ20లో అతడినే ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే సంజూ శాంసన్ మరోసారి బెంచ్‌కు పరిమితం కావాల్సివస్తుంది.
బౌలర్లలో సౌతాఫ్రికా సిరీస్‌లో అదరగొట్టిన అర్షదీప్ తుది జట్టులో ఉండటం పక్కా. అతడితో పాటు ముకేష్ కుమార్, ఆవేశ్ ఖాన్‌లలో ఒకరిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్పిన్సర్లలో అక్షర్, కుల్‌దీప్‌లను ఆడించనున్నట్లు కనిపిస్తోంది.
రషీద్ లేకుండానే...
మరోవైపు అప్ఘనిస్థాన్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఇబ్రహీం, గుర్బాజ్ వంటి హిట్టర్లను కట్టడి చేయకపోతే టీమిండియాకు కష్టాలు తప్పవు. రషీద్ ఖాన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం అప్ఘనిస్తాన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అయితే ఐపీఎల్‌లో ఆడిన అనుభవం మిగిలిన బౌలర్లకు ఉండటం అప్ఘనిస్తాన్‌కు కలిసిరావచ్చు. నబీ, నూర్ అహ్మద్, ముజీబ్ రెహ్మాన్ పైనే అప్ఘన్ బౌలింగ్ భారం మొత్తం ఉంది.
బ్యాటింగ్‌కు అనుకూలం...
మొహాలీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. ఈ పిచ్‌పై టీమిండియాకు మంచి రికార్డు ఉంది. 2009లో ఇదే స్టేడియంలో శ్రీలంకపై 211 పరుగులు చేసింది. ఇప్పటివరకు మొహాలీ స్టేడియంలో నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడియన టీమిండియా మూడింటిలో గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఓటమి పాలైంది. నేటి మ్యాచ్‌లో పరుగల వరద పారడం ఖాయంగానే కనిపిస్తోంది.