ICC On World Cup Pitch: వ‌ర‌ల్డ్ క‌ప్ పిచ్‌ల‌పై ఐసీసీ ఫోక‌స్ - క్యూరెట‌ర్స్‌కు వార్నింగ్‌-icc special focus on world cup pitches boundary length increased ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Icc On World Cup Pitch: వ‌ర‌ల్డ్ క‌ప్ పిచ్‌ల‌పై ఐసీసీ ఫోక‌స్ - క్యూరెట‌ర్స్‌కు వార్నింగ్‌

ICC On World Cup Pitch: వ‌ర‌ల్డ్ క‌ప్ పిచ్‌ల‌పై ఐసీసీ ఫోక‌స్ - క్యూరెట‌ర్స్‌కు వార్నింగ్‌

HT Telugu Desk HT Telugu
Sep 20, 2023 10:14 AM IST

ICC On World Cup Pitch: వ‌ర‌ల్డ్ క‌ప్ పిచ్‌ల‌పై ఐసీసీ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌కు అనుకూలంగా ఉండేలా పిచ్‌ల‌ను త‌యారు చేసేలా క్యూరెట‌ర్స్‌కు ఇన్స్‌స్ట్ర‌క్ష‌న్స్ ఇచ్చిన‌ట్లు తెలిసింది.

వ‌ర‌ల్డ్ క‌ప్ పిచ్‌
వ‌ర‌ల్డ్ క‌ప్ పిచ్‌

ICC On World Cup Pitch: ఈ ఏడాది జ‌రుగ‌నున్న వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 5 నుంచి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ మొద‌లుకానుంది. గ‌తంలో ఇత‌ర దేశాల‌తో క‌లిసి వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. వ‌ర‌ల్డ్‌ క‌ప్ మొత్తానికి ఇండియా ఆతిథ్యం ఇవ్వ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం గ‌మ‌నార్హం.ఇండియాతో పాటు మిగిలిన‌ ఆసియా దేశాల పిచ్‌లు స్పిన్న‌ర్ల‌కు అనుకూలం అనే వాద‌న చాలా కాలంగా ఉంది.

అందులోనూ అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్‌ల‌లో ఇండియాలో మంచు ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో స్పిన్న‌ర్లు కీల‌క భూమిక పోషించ‌నున్న‌ట్లు మాజీ క్రికెట‌ర్లు అభిప్రాయ‌ప‌డుతోన్నారు. టాస్ కూడా కీల‌కంగా మార‌నుంద‌ని, . టాస్ గెలిచి, సెకండ్ బ్యాటింగ్ ఎంచుకునే జ‌ట్ల‌కు గెలిచే ఛాన్సెన్స్‌ ఎక్కువ‌గా ఉంటాయ‌ని క్రికెట్ విశ్లేష‌కులు చెబుతోన్నారు. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పేస‌ర్స్‌ పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌క‌పోవ‌చ్చున‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో వ‌ర‌ల్డ్ క‌ప్‌కు అతిథ్యం ఇవ్వ‌నున్న పిచ్‌ల‌పై ఐసీసీ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం. బౌండ‌రీ దూరం పెంచ‌డంతో పిచ్‌ల‌పై గ్రాస్ ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాల‌ని క్యూరెట‌ర్స్‌కు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల్ని జారీ చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఇండియాలోని చాలా స్టేడియాల బౌండ‌రీ దూరం 65 మీట‌ర్లుగా ఉంది. ఆ దూరాన్ని ఐదు మీట‌ర్లు పెంచి 70 మీట‌ర్లు ఉండేలా చూడాల‌ని క్యూరెట‌ర్స్‌కు ఐసీసీ చెప్పిన‌ట్లు స‌మాచారం.

అలాగే పిచ్‌పై గ్రాస్ ఎక్కువ‌గా ఉండేలా చూడ‌టం వ‌ల్ల స్పిన్స‌ర్ల‌తో పాటు పేస‌ర్లు కూడా మ్యాచ్‌పై ప‌ట్టు బిగించే అవ‌కాశం ఉంటుంద‌ని ఐసీసీ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌కు అనుకూలంగా ఉండేలా పిచ్‌ల‌ను త‌యారు ఉండ‌టంపైనే ఐసీసీ దృష్టి పెట్టిన‌ట్లు తెలిసింది. అందుకు త‌గ్గ‌ట్లుగా పిచ్‌ల‌ను సిద్ధం చేయ‌డానికి క్యూరెట‌ర్స్‌తో ఐసీసీ చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం.

Whats_app_banner