Video: ధోనీ కాళ్లు మొక్కబోయిన అభిమాని.. ఆయన ఏం చేశారంటే..: వీడియో వైరల్-fan tries to touch ms dhoni feat video goes viral on social media ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Video: ధోనీ కాళ్లు మొక్కబోయిన అభిమాని.. ఆయన ఏం చేశారంటే..: వీడియో వైరల్

Video: ధోనీ కాళ్లు మొక్కబోయిన అభిమాని.. ఆయన ఏం చేశారంటే..: వీడియో వైరల్

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 27, 2023 06:54 PM IST

MS Dhoni Video: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కాళ్లు మొక్కోబోయారు ఓ అభిమాని. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

Video: ధోనీ కాళ్లు మొక్కబోయిన అభిమాని.. ఆయన ఏం చేశారంటే..: వీడియో వైరల్
Video: ధోనీ కాళ్లు మొక్కబోయిన అభిమాని.. ఆయన ఏం చేశారంటే..: వీడియో వైరల్

MS Dhoni Video: టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన అంటే కోట్లాది మంది ఇష్టపడతారు. చాలా మంది యువ ఆటగాళ్లు ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటారు. అభిమానులు, ప్లేయర్లు ధోనీని ఎంతో గౌరవిస్తారు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా, ఓ మహిళా అభిమాని ధోనీకి పాదాభివందనం చేయబోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. వివరాలివే..

తాజాగా ఓ కార్యక్రమంలో ధోనీ పాల్గొన్నారు. కుర్చీలో ధోనీ కూర్చొని ఉండగా.. ఓ అభిమాని ఆయన కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. దీంతో అలా చేయవద్దని ఆమెతో ధోనీ చెప్పారు. షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పారు. ఆ ఫ్యాన్‍కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‍కు గుడ్‍బై చెప్పిన ఎంఎస్ ధోనీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొనసాగుతున్నారు. ఈ ఏడాది సీజన్‍లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‍కే) టైటిల్ గెలిచింది. ఐదోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. కాలికి తీవ్ర గాయమైనా సీజన్ మొత్తం అలాగే ఆడారు ధోనీ. కొన్ని మ్యాచ్‍లు కుంటుతూనే ఆడి తన పట్టుదలను, అంకితభావాన్ని ప్రదర్శించారు. సీజన్ ముగిశాక మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. శరీరం సహకరిస్తే వచ్చే ఏడాది ఐపీఎల్ కూడా ఆడతానని ధోనీ చెప్పడంతో అభిమానులు అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టీమిండియాకు ధోనీ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. ఆయన కెప్టెన్సీలోనే భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్‍లను గెలిచింది. టీమిండియాకు రెండు ప్రపంచకప్ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‍గా మహీ ఉన్నారు. 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కూడా ధోనీ నాయకత్వంలోనే భారత్ గెలిచింది.

Whats_app_banner