England Cricket Team: రెండో టెస్ట్‌లో ఓటమి తర్వాత అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ టీమ్ - కారణం ఇదే!
England Cricket Team: వైజాగ్ టెస్ట్‌లో ఓటమి తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అబుదాబి వెళ్లింది. మూడో టెస్ట్ ప్రారంభానికి తొమ్మిది రోజులు గ్యాప్ ఉండటంతో టూర్ కోసం ఇంగ్లండ్ జట్టు అబుదాబి వెళ్లినట్లు సమాచారం.
England Cricket Team: రెండో టెస్ట్‌లో ఓటమి తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ఇండియాను వీడింది. అబుదాబి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. సోమవారం ముగిసిన మూడో టెస్ట్‌లో 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించింది. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌గిల్ బ్యాటింగ్‌తో చెలరేగడం, బుమ్రా, అశ్విన్ బౌలింగ్‌లో విజృంభించడంతో ఇంగ్లండ్‌కు చెక్ పెట్టిన టీమిండియా సిరీస్‌ను సమం చేసింది.
అబుదాబి టూర్...
వైజాగ్ టెస్ట్‌లో ఓటమి తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అబుదాబి వెళ్లింది. సోమవారం బెన్‌స్టోక్స్‌తో పాటు ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ మెంబర్స్ అబుదాబికి ప్రయాణమయ్యారు. మూడో టెస్ట్‌కు తొమ్మిది రోజులు గ్యాప్ ఉండటంతో అబుదాబి టూర్‌కు ఇంగ్లండ్ క్రికెటర్లు వెళ్లినట్లు సమాచారం. రెండో టెస్ట్‌లో ఓటమి ఒత్తిడి నుంచి బయటపడటమే కాకుండా మిగిలిన టెస్ట్‌లకు పూర్థిస్థాయిలో సన్నద్ధం కావడానికి ఇంగ్లండ్ క్రికెటర్లకు ఈ టూర్ ఉపయోగపడనున్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. తమ కుటుంబసభ్యులతో అబుదాబి టూర్‌ను ఇంగ్లండ్ క్రికెటర్లు ఆనందంగా గడిపేలా టీమ్ మేనేజ్‌మెంట్ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.
ఫిబ్రవరి 15 నుంచి…
మూడు టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో ప్రారంభంకానుంది. టెస్ట్ ప్రారంభానికి రెండు రోజుల ముందు ఇంగ్లండ్ జట్టు ఇండియాకు తిరిగిరానుందని సమాచారం. ఇండియా టూర్‌కు ముందు అబుదాబిలో ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ కొన్నాళ్లు క్యాంపు ఏర్పాటుచేసింది. ఈ టెస్ట్ సిరీస్ కోసం సీరియస్‌గా సన్నద్ధమైంది. ఇండియా పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై అబుదాబి క్యాంపులో ఇంగ్లండ్ క్రికెటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. తాజా టూర్‌లో తిరిగి ప్రాక్టీస్‌ను కొనసాగించబోతున్నట్లు సమాచారం. గోల్ప్, ఫుట్‌బాల్‌తో పాటు ఇతర గేమ్స్ ఆడుతూ ఇంగ్లంగ్ క్రికెటర్‌లు టీమ్ స్పెండ్ చేయబోతున్నట్లు సమాచారం.
చెలరేగిన బుమ్రా...
వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఈ టెస్ట్‌లో టీమిండియా 106 రన్స్ తేడాతో ఘన విజయాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 396 రన్స్ చేయగా...ఇంగ్లండ్ 253 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 255 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 399 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. లక్ష్యఛేధనలో తడబడిన ఇంగ్లండ్ 292 పరుగులకు ఆలౌటైంది.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించారు. బుమ్రా కూడా బౌలింగ్‌లో చెలరేగాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆరు, సెకండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ప్రస్తుతం ఇండియా, ఇంగ్లండ్ 1-1తో సమంగా ఉన్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది.రెండో టెస్ట్‌లో బుమ్రాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
కోహ్లి రానున్నాడు...
హైదరాబాద్, వైజాగ్ టెస్ట్‌లకు దూరమైన విరాట్ కోహ్లి రాజ్‌కోట్ టెస్ట్ నుంచి జట్టులోకి రానున్నాడు. కోహ్లి రాకతో టీమిండియా బ్యాటింగ్ బలంగా మారనుంది. బ్యాటింగ్ పరంగా మూడో టెస్ట్‌లో టీమిండియా చాలా మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.