India Squad For World Cup: వరల్డ్ కప్ ఆడబోయే టీమ్ ఇండియా జట్టు ఇదే - కేఎల్ రాహుల్‌కు మరో ఛాన్స్!
India Squad For World Cup: వన్డే వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌తో పాటు టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కింది.
India Squad For World Cup:వన్డే వరల్డ్ కోసం భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ప్రయోగాల జోలికి పోకుండా ఈ సారి అనుభవానికే పెద్ద పీట వేశారు. సీనియర్స్‌కు ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించారు. వన్డే వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్డిక్ పాండ్య వ్యవహరించబోతున్నారు.
రాహుల్ కు ఛాన్స్…
మరోసారి కేఎల్ రాహుల్ పై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు వన్డే వరల్డ్ కప్ జట్టులో అతడికి చోటు కల్పించారు. రాహుల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్‌కు ఛాన్స్ ఇచ్చారు. వన్డేలో విఫలమవుతోన్న టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్‌కు వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వికెట్ కీపర్స్ స్థానం కోసం కేఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్ కిషన్ ను ఎంపికచేశారు. ఆల్ రౌండర్ కోటాలో జడేజా, స్పిన్పర్లుగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లకు సెలెక్టర్లు చోటు కల్పించారు. పేస్ భారాన్ని బుమ్రా, షమీతో పాటు శార్దూల్ ఠాకూర్, సిరాజ్ మోయబోతున్నారు.
సంజూ శాంసన్, తిలక్ వర్మకు నిరాశ....
ఐపీఎల్‌లో చెలరేగిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమి జరగలేదు. తిలక్ వర్మతో పాటు సంజూ శాంసన్‌ను సెలెక్లర్లు పక్కనపెట్టారు.
సీనియర్ స్పిన్సర్స్ అశ్విన్, చాహల్‌లకు నిరాశే ఎదురైంది. వరల్డ్ కప్ టీమ్‌లో మార్పులు చేసుకునేందుకు సెప్టెంబర్ 28 వరకు ఐసీసీ అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో జట్టులో ఏవైనా మార్పులు ఉంటాయా? ఇదే జట్టును ఫైనల్ చేస్తారా? అన్నది చూడాల్సిందే. ఈ వన్డే వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
టీమ్ ఇండియా వరల్డ్ కప్ జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, బుమ్రా, షమీ, సిరాజ్, కుల్దీప్ యాదవ్