Zomato new features : జొమాటోలో సరికొత్త ఫీచర్​- ఇక ఆర్డర్​ని ‘షెడ్యూల్​’ చేసుకోవచ్చు!-zomato launches order scheduling feature delhi ncr and more to get update ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato New Features : జొమాటోలో సరికొత్త ఫీచర్​- ఇక ఆర్డర్​ని ‘షెడ్యూల్​’ చేసుకోవచ్చు!

Zomato new features : జొమాటోలో సరికొత్త ఫీచర్​- ఇక ఆర్డర్​ని ‘షెడ్యూల్​’ చేసుకోవచ్చు!

Sharath Chitturi HT Telugu
Aug 25, 2024 09:45 AM IST

సరికొత్త ఫీచర్​ని జొమాటో లాంచ్​ చేసింది. ఇక రెండు రోజుల ముందుగానే మీరు ఫుడ్​ ఆర్డర్స్​ని షెడ్యూల్​ చేసుకోవచ్చు! పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

జొమాటోలో కొత్త ఫీచర్​..
జొమాటోలో కొత్త ఫీచర్​..

కస్టమర్స్​ని సంతృప్తి పరిచేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్​ని లాంచ్​ చేస్తోంది దిగ్గజ ఫుడ్​ డెలివరీ ప్లాట్​ఫామ్​ జొమాటో. ఇప్పుడు మరొ కొత్త ఫీచర్​ని ఆవిష్కరించింది. ఈ ఫీచర్​తో కస్టమర్లు తమ ఆర్డర్లను ముందే ‘షెడ్యూల్​’ చేసి పెట్టుకోవచ్చు.

జొమాటో ‘షెడ్యూల్​’ ఫీచర్​..

జొమాటో కొత్త ఫీచర్​తో ఫుడ్ ఆర్డర్లను రెండు రోజుల ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్​ ప్రస్తుతం అనేక ప్రధాన భారతీయ నగరాలలో అందుబాటులో ఉంది. ఇది యూజర్ ఎక్స్​పీరియెన్స్​ని మరింత మెరుగుపరుస్తుంది.

జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ జొమాటో కొత్త ఫీచర్​ని లాంచ్ చేసినట్లు సోషల్​ మీడియాలో ప్రకటించారు. దిల్లీ ఎన్​సీఆర్, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, చండీగఢ్, లక్నో, జైపూర్​లోని సుమారు 13,000 రెస్టారెంట్లలో (రూ .1,000 కంటే ఎక్కువ ఆర్డర్లకు) ఈ సర్వీస్​ అందుబాటులో ఉందని గోయల్ తెలిపారు.

జొమాటోలో ఆర్డర్లను షెడ్యూల్ చేసుకోవచ్చని గోయల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. “2 రోజుల ముందు ఆర్డర్ ఇవ్వడం ద్వారా మీ ఫుడ్​ని బాగా ప్లాన్ చేయండి. మేము సమయానికి డెలివరీ చేస్తాము. ప్రస్తుతం ఢిల్లీ ఎన్​సీఆర్, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, చండీగఢ్, లక్నో, జైపూర్​లోని 13,000 అవుట్లెట్లలో రూ.1,000 కంటే ఎక్కువ ఆర్డర్లకు షెడ్యూలింగ్ అందుబాటులో ఉంది,” అని గోయల్​ తెలిపారు.

రానున్న కాలంలో ధరతో సంబంధం లేకుండా అన్ని ఆర్డర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొంటూ ఈ ఫీచర్​ని విస్తరించే ప్రణాళికలను జొమాటో సీఈఓ సూచించారు. అదనంగా, భవిష్యత్తులో రెస్టారెంట్లు, నగరాల సంఖ్యను పెంచాలని జొమాటో లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

"ఈ రెస్టారెంట్లు చారిత్రాత్మకంగా, అధిక పరిమాణంలో వంటకాలను నిల్వ కలిగి ఉన్నాయి. వంటగది-తయారీ-సమయ స్థిరత్వాన్ని చూపించాయి. మరిన్ని రెస్టారెంట్లు, నగరాలను కలుపుతాము. త్వరలోనే అన్ని ఆర్డర్లకు దీన్ని పొడిగిస్తాం,' అని పీయూష్ గోయల్ తెలిపారు.

జొమాటో తన లెజెండ్స్ ఇంటర్ సిటీ డెలివరీ సేవను నిలిపివేసిన కొద్దిసేపటికే ఈ కొత్త షెడ్యూలింగ్ ఆప్షన్​ని తీసుకొచ్చింది. ఆర్డర్ షెడ్యూలింగ్ ప్రవేశపెట్టడం ద్వారా ఫుడ్ డెలివరీ మార్కెట్లో తన సర్వీస్ ఆఫర్లను మెరుగుపరిచి, పోటీని జొమాటో తట్టుకోగలదు.

కొత్త కొత్త ఫీచర్స్​ తీసుకొచ్చి కస్టమర్స్​ని సంతృప్తి పరిచేందుకు వివిధ చర్యలు చేపడుతోంది జొమాటో. మరి ఈ షెడ్యూలింగ్​ ఫీచర్​ని కస్టమర్లు ఎంత మేర ఉపయోగించుకుంటారో చూడాలి.

అయితే ఈ కొత్త ఫీచర్​పై నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూలింగ్​ ఫీచర్​తో ఫుడ్​ని వేడివేడిగా వండి ఇస్తారన్న నమ్మకం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.

"ఫ్రిజ్​లో పెట్టి, డిస్పాచ్​ చేసే సమయానికి మైక్రోవేవ్​ లేదా రీహీట్​ చేసి ఇస్తే?' అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

“ఆర్డర్ షెడ్యూలింగ్ అవసరమా, అంత ముఖ్యమా? అంటే ఎవరైనా తమకు నచ్చిన చిన్న సమావేశానికి కూడా ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నప్పటికీ, రెండు రోజుల్లో ప్రాధాన్యతలు మారిపోతాయి,” అని మరొకరు పోస్ట్ చేశారు.

మరి ఈ జొమాటో షెడ్యూలింగ్​ ఫీచర్​ మీద ఈ ఒపీనియన్​ ఏంటి? ఈ షెడ్యూలింగ్​ ఫీచర్​ క్లిక్​ అవుతుందా?

సంబంధిత కథనం

టాపిక్