YouTube Shorts: యూట్యూబ్ షార్ట్స్ చేసేవారికి గుడ్ న్యూస్; ఇకపై షార్ట్స్ నిడివి 60సెకన్లు కాదు..-youtube shorts says goodbye to the 60 second limit allowing 3 minute videos ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Youtube Shorts: యూట్యూబ్ షార్ట్స్ చేసేవారికి గుడ్ న్యూస్; ఇకపై షార్ట్స్ నిడివి 60సెకన్లు కాదు..

YouTube Shorts: యూట్యూబ్ షార్ట్స్ చేసేవారికి గుడ్ న్యూస్; ఇకపై షార్ట్స్ నిడివి 60సెకన్లు కాదు..

Sudarshan V HT Telugu
Oct 04, 2024 08:30 PM IST

YouTube Shorts: యూట్యూబ్ షార్ట్స్ చేసేవారికి యూట్యూబ్ శుభవార్త తెలిపింది. యూట్యూబ్ షార్ట్స్ నిడివిని 3 నిమిషాలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఆ నిడివి 60 సెకన్లు మాత్రమే ఉండేది. ఇన్ స్టా గ్రామ్ రీల్స్, టిక్ టాక్ లకు పోటీగా కంటెంట్ క్రియేటర్లను ఆకట్టుకునేందుకు యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది.

యూట్యూబ్ షార్ట్స్ నిడివి పెంపు
యూట్యూబ్ షార్ట్స్ నిడివి పెంపు (YouTube)

YouTube Shorts: ఇన్స్టాగ్రామ్ రీల్స్, టిక్ టాక్ లకు పోటీగా యూట్యూబ్ షార్ట్స్ నిడివిని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు యూట్యూబ్ లో షార్ట్స్ 3 నిమిషాల నిడివి గల చిన్న వీడియోలను పోస్ట్ చేయవచ్చు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ రెండూ కూడా యూజర్లు ఎక్కువ నిడివి గల వీడియోలను పోస్ట్ చేయడానికి వీలు కల్పిస్తున్నాయి.

yearly horoscope entry point

కంటెంట్ క్రియేటర్ల అసంతృప్తి

చాలామంది కంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్ లోని ఈ 60 సెకన్ల నిడివి పరిమితిపై అసంతృప్తితో ఉన్నారు. ఆ పరిమిత సమయంలో తాము చెప్పాలనుకున్నది సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయలేమని వారు వాదిస్తున్నారు. అలా పరిమితి విధించడం, అదీ ఒక నిమిషం సమయమే ఇవ్వడాన్ని తప్పు బడ్తున్నారు. ఈ నేపథ్యంలో.. యూట్యూబ్ షార్ట్స్ నిడివిని పెంచుతున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది.

లాంగ్ యూట్యూబ్ షార్ట్స్

అక్టోబర్ 15వ తేదీ నుంచి కంటెంట్ క్రియేటర్లు 3 నిమిషాల నిడివి గల లాంగ్ షార్ట్స్ వీడియోలను పోస్ట్ చేయవచ్చని యూట్యూబ్ ప్రకటించింది. క్రియేటర్లు కోరిన టాప్ ఫీచర్ ఇది అని, ఈ మార్పు స్క్వేర్ లేదా పొడవైన యాస్పెక్ట్ రేషియోలలోని వీడియోలకు వర్తిస్తుందని యూట్యూబ్ పేర్కొంది. ఇది అక్టోబర్ 15 కంటే ముందు అప్ లోడ్ చేసిన వీడియోలపై ప్రభావం చూపదని యూట్యూబ్ తెలిపింది. రాబోయే నెలల్లో లాంగ్ షార్ట్స్ వీడియోల కోసం యూట్యూబ్ ను మెరుగుపరచడానికి కంపెనీ కృషి చేస్తోందని యూట్యూబ్ షార్ట్స్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ టాడ్ షెర్మన్ పేర్కొన్నారు.

త్వరలో మరిన్ని అప్ డేట్స్

యూట్యూబ్ షార్ట్స్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ (YOUTUBE) మరిన్ని ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది. వినియోగదారులు త్వరలో టెంప్లెట్లను ఉపయోగించి తమకు నచ్చిన షార్ట్స్ వీడియోను మళ్లీ రూపొందించే అవకాశం కల్పించనుంది. ట్రెండ్స్ పై జంప్ చేయడం, సౌండ్ ట్రాక్ లకు క్లిప్ లను జతచేయడం, షార్ట్ ను రీమిక్స్ చేయడం.. వంటి వాటిని కూడా సులభం చేయనుంది. అంతేకాకుండా యూజర్లు తమకు ఇష్టమైన వీడియోల క్లిప్స్ ను రీమిక్స్ చేసుకోవచ్చు. కృత్రిమ మేధను మిక్స్ లో చేర్చడానికి, గూగుల్ తన డీప్ మైండ్ వీడియో మోడల్ వీడియోను షార్ట్స్ లోకి ఇంటిగ్రేట్ చేయడానికి త్వరలో వీలు కల్పించనుంది. ఇది క్రియేటర్లకు వీడియో (video) బ్యాక్గ్రౌండ్స్, స్టాండలోన్ క్లిప్లను సృష్టించడానికి వీలు కల్పిస్తుంది.

Whats_app_banner