Xiaomi 15 : 50ఎంపీ ట్రిపుల్ కెమెరా- 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో షావోమీ 15.. బెస్ట్ ఆల్‌రౌండ్ స్మార్ట్‌ఫోన్?
Xiaomi 15 launch date in India : షావోమీ 15 లాంచ్‌కు రెడీ అవుతుంది. అయితే లాంచ్‌కి ముందే, ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కి సంబంధించిన అనేక కీలక ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
షావోమీ స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉంది. అందుకే సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్యాడ్జెట్స్‌ని లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు, ఈ నెలలోనే షావోమీ 15ని లాంచ్ చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనికి ముందే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఎన్నో కీలక ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. అవి యూజర్స్‌ని చాలా ఎగ్జైట్ చేస్తున్నాయి! ఈ నేపథ్యంలో రాబోయో షావోమీ 15 స్మార్ట్‌ఫోన్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
షావోమీ 15 కీలక స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో లీక్..
యోగేష్ బ్రార్ లీక్ ప్రకారం షావోమీ 15 6.36 ఇంచ్ 1.5కే ఫ్లాట్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది షావోమీ 14 మాదిరిగానే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో ఈ ఫోన్ పనిచేయనుంది. ఇది ఈ నెలాఖరులో కంపెనీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌గా లాంచ్ కానుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 కలిగి ఉన్న దాని మునుపటి మోడల్ మాదిరిగా కాకుండా, ఈ రాబోయే మోడల్ "ఎలైట్" బ్రాండింగ్‌కు అనుకూలంగా "జెన్" నామకరణ సంప్రదాయాన్ని తొలగించే అవకాశం ఉంంది. కెమెరాల పరంగా చూస్తే, షావోమీ 15లో 50 మెగాపిక్సెల్ ఓవీ 50 హెచ్ ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 50 మెగాపిక్సెల్ 3.2 రెట్ల టెలిఫోటో కెమెరా ఉండవచ్చు. మునుపటి మోడళ్ల మాదిరిగానే, ఈ ఫోన్ ఇమేజ్ నాణ్యతను పెంచడానికి లైకా ఆప్టిక్స్ని ఉపయోగిస్తుంది.
షావోమీ 15: బ్యాటరీ, ఇతర కీలక అప్‌గ్రేడ్స్..
లీక్స్ ప్రకారం ఈ షావోమీ స్మార్ట్‌ఫోన్‌లో 90వాట్ వైర్డ్, 50వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. సాఫ్ట్వేర్ విషయానికొస్తే, షావోమీ 15 హైపర్ఓఎస్ 2.0 పై పనిచేసే అవకాశం ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 పై ఆధారపడి ఉంటుంది. ఇది ఐపీ68 రేటింగ్ కలిగి ఉంటుందని, డస్ట్- వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుందని భావిస్తున్నారు.
మునుపటి మోడళ్లతో పోలిస్తే షావోమీ 15 దాని ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీలో గణనీయమైన అప్‌గ్రేడ్స్ కలిగి ఉంటుందని ఈ లీకులు సూచిస్తున్నాయి. ఫోన్ డిజైన్ ఇంకా అఫీషియల్‌గా వెరిఫై అవ్వలేదు కానీ, షావోమీ 15 ప్రో మీద లీకైన రెండర్లు.. షావోమీ 14 ప్రోతో పోలికలను చూపిస్తూ కొన్ని ఆధారాలను అందించాయి. రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ప్రధాన వ్యత్యాసం సెన్సార్ల వెలుపల ఫ్లాష్ పునర్నిర్మాణం!
షావోమీ సంస్థ షావోమీ 15, షావోమీ 15 ప్రోలను మొదట చైనాలో లాంచ్ చేయనుంది. అక్కడి నుంచి కొన్ని నెలల తర్వాత భారతదేశంతో సహా ఇతర మార్కెట్లలో ఈ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ అవుతాయి. అయితే అఫీషియల్ లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దీని మీద సంస్థ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం