Xiaomi Phone Discount : రూ.10 వేల డిస్కౌంట్‌తో షావోమి ఫోన్.. వావ్ అనిపించే కెమెరా ఫీచర్లు-xiaomi 14 available with rupees 10000 off on amazon india know the phone features and specifications ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Xiaomi Phone Discount : రూ.10 వేల డిస్కౌంట్‌తో షావోమి ఫోన్.. వావ్ అనిపించే కెమెరా ఫీచర్లు

Xiaomi Phone Discount : రూ.10 వేల డిస్కౌంట్‌తో షావోమి ఫోన్.. వావ్ అనిపించే కెమెరా ఫీచర్లు

Anand Sai HT Telugu

Amazon Discount Offers : అమెజాన్ ఇండియా మంచి ఆఫర్లను అందిస్తోంది. తాజాగా షావోమి ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. రూ.10 వేల డిస్కౌంట్‌తో ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

షావోమి 14పై డిస్కౌంట్

అమెజాన్ ఇండియా మీ కోసం అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ డీల్‌లో మీరు షావోమి ప్రీమియం ఫోన్ - షావోమి 14 ను భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అమెజాన్ ఇండియాలో రూ.69,998గా ఉంది. రూ.10 వేల డిస్కౌంట్ తో నేరుగా ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ బంపర్ ఫ్లాట్ డిస్కౌంట్ కోసం మీరు ఐసీఐసీఐ, ఎస్బీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుతో చెల్లించాలి.

ఫోన్ పై కంపెనీ సుమారు రూ.3500 క్యాష్ బ్యాక్ ను కూడా అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో ఈ ఫోన్ ధరను రూ.63,900 వరకు తగ్గించుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

ఈ ఫోన్‌లో 6.36 అంగుళాల ఎల్టీపీఓ అమోఎల్ఈడీ డిస్ప్లేను కంపెనీ అందిస్తోంది. ఈ 1.5కే డిస్ ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్ ఈ ఫోన్ డిస్ ప్లే క్వాలిటీని విపరీతంగా పెంచింది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో అందించారు. ప్రాసెసర్ గా ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3ను కంపెనీ అందిస్తోంది.

ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన మూడు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కంపెనీ అందిస్తోంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4610 ఎంఏహెచ్‌గా ఉంది.

ఈ బ్యాటరీ 90 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 50 వాట్ల వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇక ఓఎస్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. స్ట్రాంగ్ సౌండ్ కోసం డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లను కూడా అందించారు.