Marriage : పెళ్లిలో తాగి అత్తామామలను చెప్పుతో కొట్టిన వరుడు.. పోలీసులకు ఫోన్ చేసిన పెళ్లి కూతురు
Uttar Pradesh News : పెళ్లిలో తాగి వచ్చి కాబోయే అత్తామామలను వరుడు చెప్పుతో కొట్టాడు. దీంతో పెళ్లి కూతురికి కోపం వచ్చింది. వెంటనే పోలీసులకు కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చింది.
పెళ్లి సందర్భంగా మండపానికి వెళ్లాలంటే తెల్లవారుజామునే స్నానం చేసి మంచి దుస్తులు ధరించడం ఆనవాయితీ. అందరితో కలుపుగోలుగా ఉంటూ.. నవ్వుతూ ఆహ్వానించాలి. పెళ్లి కుమారుడికైతే ఇంకా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఓ పెళ్లికొడుకు మాత్రం పెళ్లికూతురు తల్లిదండ్రులు చెప్పుతో కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తాగి వచ్చి ఇలా చేశాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బండాలో దిలీప్ (25)తో అంజలి (18) వివాహం జరుగుతుంది. మరికొద్ది నిమిషాల్లో పెళ్లి అయిపోతుంది. సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతుండగా వరుడు దిలీప్ ఒక్కసారిగా అంజలి తల్లి మనీషా, తండ్రి సంతోష్‌లను చెప్పుతో కొట్టాడు. దీంతో అక్కడ పరిస్థితి మారిపోయింది. ఉన్నట్టుండి వరుడు ఇలా ప్రవర్తించేసరికి అందరూ షాక్ అయ్యారు. దీంతో వధువుకు కోపం వచ్చింది. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దిలీప్, అతని అన్న దీపక్, మామ మాతా ప్రసాద్, అతని తండ్రి రామకృపాల్‌లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. బంధువుల జోక్యంతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. తర్వాత ఆలయంలో ఇరువర్గాల సమక్షంలో వివాహం జరిగింది. ఇరువర్గాలు అంగీకరించడంతో అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని, పెళ్లి పూర్తి అయిందని పోలీసులు తెలిపారు.
యూపీలో మరో ఘటన
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మరో ఘటనలో పెళ్లి మెనూలో చేపలు లేవని వధువు తల్లిదండ్రులపై వరుడి పక్షం దాడి చేసింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఫుడ్ మెనూలో చేపలు లేవని వధువు వైపు వాళ్లందరిపైనా వరుడి బంధువులు కొట్టారు. చేపలు లేకపోవడంతో పెళ్లి గొడవలో ఆరుగురికి గాయాలయ్యాయి.
దేవరియాలోని ఆనంద్ నగర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. జులై 11న అభిషేక్ శర్మ అనే వ్యక్తితో సుష్మా పెళ్లి ఉంది. కాసేపటికి వరుడు తరఫున వారు వచ్చి.. పెళ్లి మెనూలో చేపలు లేవని వాగ్వాదం మెుదలు పెట్టారు. దీంతో వరుడు కూడా ఎందుకు చేపలు లేవు? అమ్మాయిని చెంపదెబ్బ కొట్టాడు. తర్వాత వధువు అమ్మానాన్నలపై వరుడు తరఫు బంధువులు దాడికి దిగారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. పెళ్లికి వచ్చిన అతిథుల ఇరు కుటుంబాలు వాదించుకోవడంతో గొడవ పెద్దదైంది. ఒకరిపై ఒకరు దాడడి చేసుకున్నారు. ఈ పెళ్లి గొడవలో కనీసం ఆరుగురికి గాయాలయ్యాయి.