రూ.9999కే 16 జీబీ ర్యామ్‌తో మోటరోలా 5జీ ఫోన్.. డాల్బీ సౌండ్‌ను ఎంజాయ్ చేయోచ్చు-motorola g34 5g phone with huge discount know the price and features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రూ.9999కే 16 జీబీ ర్యామ్‌తో మోటరోలా 5జీ ఫోన్.. డాల్బీ సౌండ్‌ను ఎంజాయ్ చేయోచ్చు

రూ.9999కే 16 జీబీ ర్యామ్‌తో మోటరోలా 5జీ ఫోన్.. డాల్బీ సౌండ్‌ను ఎంజాయ్ చేయోచ్చు

Anand Sai HT Telugu
Jul 09, 2024 05:30 PM IST

Motorola G34 5G Phone Price : మోటరోలా ఎప్పటికప్పుడు సరసమైన ధరలతో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తుంది. బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కావాలి అంటే మంచి ఆఫర్ అందిస్తోంది. రూ.9999కే 5జీ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

మోటరోలా 5జీ ఫోన్
మోటరోలా 5జీ ఫోన్

మీరు 10 వేల రూపాయల కంటే తక్కువకు కొత్త ఫోన్ పొందాలనుకుంటే, ఫ్లిప్‌కార్ట్‌లో మీకు అద్భుతమైన ఆఫర్ ఉంది. ఈ బంపర్ డీల్ లో భారీ డిస్కౌంట్లతో మోటరోలా జీ సిరీస్ 5జీ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో ఈ ఫోన్ మీ సోంతం చేసుకోవచ్చు. ఇప్పుడు మేం చెబుతున్న ఫోన్ ఏదంటే.. మోటరోలా జీ34 5జీ. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. ఈ సేల్‌లో మీరు రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ కోసం, మీరు యాక్సిస్ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో చెల్లించాలి. ఈ ఫోన్ రూ.387 ఈఎంఐతో మీ సొంతం చేసుకోవచ్చు.

అలాగే ఈ ఫోన్‌పై రూ.8,750 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉంటే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ప్రీమియం వీగన్ లెదర్ డిజైన్ తో వస్తున్న ఈ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఎన్నో గొప్ప ఫీచర్లను అందించారు.

ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్ప్లే, 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉంది. 20: 9 యాస్పెక్ట్ రేషియోతో ఉన్న ఈ ఫోన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్. ఈ ఫోన్ లో కంపెనీ 580 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ లెవల్ ను అందిస్తోంది. డిస్ ప్లే ప్రొటెక్షన్ కోసం ఫోన్ లో పాండా గ్లాస్ ను కూడా అందించారు. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ ను కలిగి ఉంది. ఇందులోని వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో ఫోన్ మొత్తం ర్యామ్ 16 జీబీకి పెరుగుతుంది.

ఈ ఫోన్ 128 జీబీ యూఎఫ్ఎస్ 2.2 ఆన్బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ప్రాసెసర్ గా స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ను ఫోన్ లో అందించారు. ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ లో ఎల్ ఈడీ ఫ్లాష్ తో రెండు కెమెరాలను కంపెనీ అందిస్తోంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉంది. అదే సమయంలో సెల్ఫీల కోసం ఫోన్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇస్తున్నారు. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఇది 20 వాట్ టర్బో పవర్ ను సపోర్ట్ చేస్తుంది. సౌండ్ కోసం.. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సౌండ్ కలిగి ఉంది.

WhatsApp channel