Virat Kohli : విరాట్ కోహ్లీ వాడే ఈ ఇయర్‌బడ్స్ ధర ఎంతో తెలుసా?
Virat Kohli earbuds : విరాట్ కోహ్లీ పెట్టుకున్న ఇయర్‌బడ్స్‌పై ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. మోడల్ పేరు ఏంటి? ధర ఎంత? వంటి వివరాలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది మీకోసమే..
Beats Powerbeats Pro TWS earbuds : వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. తాజాగా యాపిల్ ఇయర్‌బడ్స్ పెట్టుకుని కనిపించాడు. ఆ ఇయర్‌బడ్స్ ఏంటి? ధర ఎంత? వంటి అంశాలపై అతని ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. అయితే.. ఈ ఇయర్‌బడ్స్ ఇండియాలో అందుబాటులో ఉండవు!
యాపిల్ ఎయిర్‌పాడ్స్ కాదు..
కరీబియన్ దీవుల్లో ఉన్న విరాట్ కోహ్లీ.. వెస్టిండీస్ వికెట్ కీపర్ జాషువా డా సిల్వా తల్లిని కలిశాడు. విరాట్‌ను చూసిన ఆమె, చాలా సంతోషించింది. ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే.. ఇందులో విరాట్ పెట్టుకున్న స్టైలిష్ ఇయర్‌బడ్స్‌పై ఫ్యాన్స్ ఫోకస్ చేశారు.
సాధారణంగా క్రికెటర్లు,సెలబ్రిటీలు యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో, యాపిల్ ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ వంటి మోడల్స్‌ను వాడుతుంటారు. కానీ అందుకు విరుద్ధంగా.. ఈసారి విరాట్ కోహ్లీ.. బీట్స్ పవర్‌బీట్స్ ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని కనిపించాడు. యాపిల్ స్టోర్‌లో దీని ధర 249.95 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 20వేలు. అయితే ఇది ఇండియాలో అందుబాటులో లేదు!
ఇదీ చూడండి:- Most Expensive Handbag : ఆ నటి హ్యాండ్ బ్యాగ్ ధర రూ.3 కోట్లు.. ఏముంది మేడమ్ అందులో?
ఈ బీట్స్ పవర్‌బీట్స్ ప్రో మోడల్లో అడ్జెస్టెబుల్ ఇయర్ హుక్స్ ఉంటాయి. ఫలితంగా కంఫర్ట్ పెరుగుతుంది. ఐపీఎక్స్4 రేటెడ్ స్వెట్, వాటర్ రెసిస్టెన్స్ వీటి సొంతం. ఇన్టెన్స్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఇవి సూట్ అవుతాయి. అందుకే విరాట్ కొన్నాడేమో!
యాపిల్ ప్రాడక్ట్..!
Virat Kohli earbuds : ఈ బీట్స్ పవర్‌బీట్స్ ప్రో కూడా యాపిల్ సంస్థకు చెందినదే! 2014లో బీట్స్ అనే సంస్థను 3 బిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేసింది యాపిల్. లాంచ్ అయిన కొన్ని సంవత్సరాల్లోనే ఈ బ్రాండ్ మోడల్స్‌కు విపరీతమైన ఆదరణ లభించింది.
ఇక క్రికెట్ విషయానికొస్తే.. ఇండియా- వెస్టిండీస్ మధ్య మంగళవారం మూడో వన్డే జరగనుంది. మొదటి వన్డేలో ఇండియా గెలిచింది. రెండో వన్డేలో వెస్టిండీస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మూడో వన్డే ఆసక్తిగా మారింది. టెస్ట్ సిరీస్‌ను ఇప్పటికే టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. ఇక వన్డేల తర్వాత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా జరగనుంది. ఆగస్ట్ 3 నుంచి ఈ సిరీస్ మొదలవుతుంది.
సంబంధిత కథనం