Today Gold Price September 25 : 70వేలు దాటిన బంగారం ధర.. కాస్త కిందకు వెండి ధరలు!-today gold rate on september 25th 2024 gold price crossed 70 thousand rupees know silver price here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Today Gold Price September 25 : 70వేలు దాటిన బంగారం ధర.. కాస్త కిందకు వెండి ధరలు!

Today Gold Price September 25 : 70వేలు దాటిన బంగారం ధర.. కాస్త కిందకు వెండి ధరలు!

Anand Sai HT Telugu
Sep 25, 2024 05:39 AM IST

Today Gold and Silver Price : దేశంలో బంగారం ధరలు బుధవారం కూడా కాస్త పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. ఏపీ, తెలంగాణతోపాటుగా దేశంలోని ఇతర నగరాల్లో ధరల వివరాలు తెలుసుకుందాం..

బంగారం ధరలు
బంగారం ధరలు (Bloomberg)

దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి రూ. 70,010కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 70,000గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 7,00,100గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 7,001గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 పెరిగి రూ. 76,370గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 76,360గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి రూ. 7,63,700గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,637గా ఉంది.

దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 70,160గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 76,520గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 70,010 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 76,370గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 70,010గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ.76,370గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 70,010గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 76,370గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 70,010గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 76,370గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.70,060గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 76,420గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 70,010గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 76,370గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు

దేశంలో వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 9280గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 92,800గా కొనసాగుతోంది. బుధవారం ఈ ధర రూ. 92,900గా ఉండేది.

హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 97,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 92,800.. బెంగళూరులో రూ. 87,100గా ఉంది.