Smartphone Tips : ఫోన్ వంద శాతం ఛార్జింగ్ పెట్టొచ్చా? ఈ విషయాలు తెలుసుకోండి
Smartphone Tips : స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ విషయంలో చాలా తప్పులు చేస్తుంటాం. దీనితో బ్యాటరీ మీద ప్రభావం పడుతుంది. అంతేకాదు కొన్నిసార్లు ఫోన్ మెుత్తం పాడైపోయే అవకాశం ఉంది. ఫోన్ ఛార్జింగ్‌కి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్ లేకుండా జీవించడం కష్టం. ప్రతీ పనికి ఇది తప్పనిసరైపోయింది. ఫోన్ లేకుటే బయటకు వెళ్లలేని పరిస్థితి. అయితే స్మార్ట్ ఫోన్ వాడకంలో కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఉదాహరణకు 2 సంవత్సరాల పాటు ఉండే మొబైల్స్ కేవలం 6 నెలల్లో పాడైపోతాయి. ముఖ్యంగా బ్యాటరీ విషయంలో కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వండి.
మొబైల్ నేడు ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన పరికరం. మొబైల్‌లో చేయాల్సిన ఏ పనినైనా క్షణంలో పూర్తి చేయొచ్చు. కానీ కొంతమందికి స్మార్ట్‌ఫోన్‌ను ఎలా ఉపయోగించాలో మాత్రమే తెలుసు. ఎలా చూసుకోవాలో తెలియడం లేదు. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే తర్వాత రోజుల్లో ఆ మొబైల్ నుండే మీకు సమస్య రావచ్చు. నేడు, స్మార్ట్‌ఫోన్‌లు ముఖ్యంగా బ్యాటరీ పరంగా ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
ఫోన్ సరిగ్గా పనిచేయడానికి బ్యాటరీ కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల మొబైల్ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు బ్యాటరీ నాణ్యత, ఛార్జింగ్ సౌకర్యాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫోన్ బ్యాటరీని ఎంత శాతం ఛార్జ్ చేయాలో చాలా మందికి తెలియదు. చాలా మంది ఫోన్ 100 శాతం ఛార్జ్ అవ్వాలని కోరుకుంటారు. వంద శాతం అయితే హమ్మయ్యా సాయంత్రం దాకా సమస్య లేదు అనుకుంటారు. అందుకే బయటకు వెళ్లి వచ్చిన ప్రతీసారి మళ్లీ మళ్లీ ఛార్జింగ్ పెడుతూనే ఉంటారు. కొంత మంది ఛార్జ్ పూర్తిగా అయిపోయే వరకు మొబైల్ వాడుతూనే ఉంటారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఛార్జింగ్ చేసే ముందు ఫోన్ బ్యాటరీని పూర్తిగా ఖాళీ చేయకూడదు. కొన్నిసార్లు ఇలా చేయడం వల్ల కూడా స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ దెబ్బతింటుంది. ఫోన్ బ్యాటరీని ఆరోగ్యంగా ఉంచాలంటే దాదాపు 20 శాతం ఛార్జింగ్ ఉన్నప్పుడు ఫోన్‌ను ఛార్జ్ చేయాలి. అలాగే 80 నుంచి 90 శాతం వరకు మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల మొబైల్ బ్యాటరీ త్వరగా పాడైపోదు.
కానీ చాలా మంది వంద శాతం ఛార్జింగ్ అయ్యేదాకా అలానే పెడుతుంటారు. దీనివలన సమస్యలు రావొచ్చు. అలాగే 20 శాతం ఛార్జింగ్ ఉన్నప్పుడే ఫోన్ ఛార్జ్ చేయాలి. మొబైల్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండేలా పాటించాల్సిన చిట్కాలివే. ఇకపై మొబైల్ ఫోన్లను తరచుగా ఛార్జింగ్ చేయకండి. దీని వల్ల మొబైల్ త్వరగా పాడైపోతుంది.