Vivo Y300 Plus : వివో వై300 ప్లస్ వివరాలు లీక్.. 50ఎంపీ కెమెరా, పెద్ద బ్యాటరీ!-vivo y300 plus india price and other details leaked check expected features here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo Y300 Plus : వివో వై300 ప్లస్ వివరాలు లీక్.. 50ఎంపీ కెమెరా, పెద్ద బ్యాటరీ!

Vivo Y300 Plus : వివో వై300 ప్లస్ వివరాలు లీక్.. 50ఎంపీ కెమెరా, పెద్ద బ్యాటరీ!

Anand Sai HT Telugu
Oct 08, 2024 11:23 AM IST

Vivo Y300 Plus : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో త్వరలో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. Vivo Y300 Plus పేరుతో ఈ మొబైల్ మార్కెట్లోకి విడుదల అవనుంది. దీనికి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.

వివో వై300 ప్లస్‌ వివరాలు లీక్
వివో వై300 ప్లస్‌ వివరాలు లీక్

వివో కంపెనీ భారత్‌లో వై సిరీస్‌ని విస్తరిస్తోంది. మరో కొత్త ఫోన్‌తో మార్కెట్‌లోకి రానుంది. వివో వై300 ప్లస్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి. రాబోయే వివో కొత్త ఫోన్ ధర ఎంత? ఫీచర్లు ఏంటి తెలుసుకుందాం..

కంపెనీ వివో వై300 ప్లస్ మొబైల్‌ను బడ్జెట్ ధరలో విడుదల చేసే ఆలోచనలో ఉంది. ఇది అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. 6.78 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో రానుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఈ మొబైల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉండవచ్చు. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

లీక్ ప్రకారం.., వివో వై300 ప్లస్ భారతదేశంలో రూ. 23,999 ధరకు విడుదల చేస్తారు. ఇది 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరగా రానుంది. ఇతర వేరియంట్లు కూడా ఉండే అవకాశం ఉంది. కంపెనీ Vivo Y300 Plus మొబైల్‌ను 6.78-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పరిచయం చేస్తుంది. ఇది పూర్తి హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తుంది.

నివేదికల ప్రకారం వివో వై300 ప్లస్ మొబైల్ 8జీబీ ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజ్‌తో రానుంది. ఈ మొబైల్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. అదనంగా ఇది 2-మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.

వివో వై300 ప్లస్ మొబైల్ 5000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీతో మార్కెట్లోకి విడుదల కానుంది. దీన్ని వేగంగా ఛార్జ్ చేయడానికి.., దీనికి 44W ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుందని భావిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జీ, 4డీ, వైఫై, బ్లూటూత్, అనేక ఇతర ఫీచర్లతో వస్తుంది. దుమ్ము, నీటి రక్షణ కోసం ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉంటుంది.

Whats_app_banner