ఈ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌పై మంచి డిస్కౌంట్.. 50ఎంపీ సోని ఏఐ కెమెరాతోపాటు మరెన్నో ఫీచర్లు-iqoo z9s pro 5g discount gets huge discount on amazon sale ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌పై మంచి డిస్కౌంట్.. 50ఎంపీ సోని ఏఐ కెమెరాతోపాటు మరెన్నో ఫీచర్లు

ఈ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌పై మంచి డిస్కౌంట్.. 50ఎంపీ సోని ఏఐ కెమెరాతోపాటు మరెన్నో ఫీచర్లు

Anand Sai HT Telugu
Oct 02, 2024 01:20 PM IST

iQOO Z9S Pro 5G Discount : ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తోంది. భారీ తగ్గింపుతో స్మార్ట్‌ఫోన్లు మీ సొంతం చేసుకోవచ్చు. ఐక్యూ స్మార్ట్‌ఫోన్ కొనాలి అనుకునేవారి కోసం మంచి డీల్ అందుబాటులో ఉంది.

ఐక్యూ ఫోన్‌పై డిస్కౌంట్
ఐక్యూ ఫోన్‌పై డిస్కౌంట్

ప్రస్తుతం అమెజాన్ ప్లాట్‌ఫారమ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 నడుస్తోంది. ఈ సేల్‌లో కొన్ని ఎంపిక చేసిన మొబైల్‌లు మంచి తగ్గింపుతో వస్తాయి. లాంచ్ ధరతో పోలిస్తే చాలా తక్కువ ధరకు మీరు స్మార్ట్‌ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. అందులో ఒకటి ఐక్యూ జెడ్9ఎస్ ప్రో 5జీ(iQOO Z9S Pro 5G). అమెజాన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో అద్భుతమైన తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ఐక్యూ జెడ్9ఎస్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంది. 17 శాతం ప్రత్యక్ష తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,998గా ఉంది. ఆఫర్‌తో కొనుగులు చేస్తే.. 21,999కు వస్తుంది.

ఐక్యూ జెడ్9ఎస్ ప్రో 5జీ ఫోన్‌లో 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ, 8జీబీ ప్లస్ 256జీబీ, 12జీబీ ప్లస్ 256జీపీ ఆప్షన్స్ ఉన్న్నాయి. ఈ ఫోన్‌లో 5,500 mAh బ్యాటరీ సామర్థ్యం కూడా ఉంది. ఈ ఫోన్ 2392×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ మద్దతు ఉంది. ఐక్యూ జెడ్9ఎస్ ప్రో 5జీ మొబైల్ Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌కి మద్దతు ఇస్తుంది.

అదేవిధంగా ఈ మొబైల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను పొందింది. దీని ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్స్, సెకండరీ కెమెరా 8 మెగా పిక్సెల్స్. భాగంలో 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఈ ఫోన్ 5,500 mAh బ్యాటరీ బ్యాకప్, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్, 5,500mAh బ్యాటరీ బ్యాకప్, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కూడా కలిగి ఉంది.

Whats_app_banner