Honor X9b 5g : 108ఎంపీ రేర్ కెమెరాతో హానర్ ఎక్స్9బీ.. ఇండియా లాంచ్‌కు రెడీ!
Honor X9b price : 108ఎంపీ రేర్ కెమెరాతో హానర్ ఎక్స్9బీ ఇండియా లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి చెందిన ఇతర ఫీచర్స్‌ని ఇక్కడ తెలుసుకుందాము..
Honor X9b price in India : హానర్ సంస్థ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్‌కు సిద్ధమవుతోంది. దీని పేరు హానర్ ఎక్స్9బీ. ఈ గ్యాడ్జెట్.. ఫిబ్రవరి 15న ఇండియాలో రిలీజ్ అవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హానర్ ఎక్స్9బీ ఫీచర్స్ ఇవేనా..?
ఈ హానర్ ఎక్స్9బీ స్మార్ట్‌ఫోన్.. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇండియాలో లాంచ్ అవుతున్న మొబైల్‌కి, అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న గ్యాడ్జెట్‌కి మధ్య పెద్దగా డిఫరెన్స్ ఉండకపోవచ్చు!
Honor X9b 5G : హానర్ ఎక్స్9బీలో.. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.78 ఇంచ్ కర్వ్డ్ ఎడ్జ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇంటిగ్రేటెడ్‌గా ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ ఇందులో ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8జీబీ ర్యామ్, 8జీబీ వర్చ్యువల్ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వంటివి ఉంటాయని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 13 లేదా ఆండ్రాయిడ్ 14 సాఫ్ట్‌వేర్‌పై ఈ హానర్ మొబైల్ పనిచేసే అవకాశం ఉంది. ఇందులో.. మిడ్నైట్ బ్లాక్, సన్‌షైన్ ఆరేంజ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయని సమాచారం.
ఇదీ చూడండి:- OnePlus 12R sale: వన్ ప్లస్ 12 ఆర్, వన్ ప్లస్ బడ్స్ 3 సేల్ ప్రారంభం
ఇక ఈ హానర్ ఎక్స్9బీలో 108ఎంపీతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా వస్తుందని సంస్థ.. అధికారికంగా ప్రకటించింది. ఇందులో ఏఐ పవర్డ్ మోషన్ సెన్సింగ్ కెమెరా కూడా ఉంటుందని సమాచారం. సెల్ఫీ కెమెరాపై ప్రస్తుతం క్లారిటీ లేదు.
Honor X9b 5g specifications : ఫిబ్రవరి 15న జరగనున్న ఓ ఈవెంట్లో.. ఈ ఎక్స్9బీ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేస్తుంది హానర్ సంస్థ. అదే ఈవెంట్లో.. ఛాయిస్ ఎక్స్5 ఇయర్‌బడ్స్, ఛాయిస్ వాచ్‌ని కూడా లాంచ్ చేస్తుందట! అంతేకాకుండా.. ఎక్స్9బ కొనే వారికి.. రూ. 2,999 విలువ చేసే మొబైల్ ప్రాటెక్షన్ ప్లాన్‌ని సంస్థ ఉచితంగా ఇస్తుందట. ఈ ప్రాటెక్షన్ ప్లాన్‌లో 1 టైమ్ స్క్రీన్ రిప్లేస్మెంట్ (మొబైల్ కొన్న మొదటి 6 నెలలు), 18 నెలల వారెంటీ, డోర్ టు డోర్ అసిస్టెన్స్ వంటివి ఉంటాయని టాక్ నడుస్తోంది.
Honor X9b price details : కాగా.. ఈ హానర్ ఎక్స్9బీ స్మార్ట్‌ఫోన్ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇతర ఫీచర్స్పైనా క్లారిటీ రావాల్సింది. లాంచ్ టైమ్ నాటికి వీటిపై ఓ స్పష్టత వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
సంబంధిత కథనం