Stocks to buy today : రూ. 180 దగ్గర ఉన్న ఈ స్టాక్ కొంటే.. భారీ లాభాలు ఖాయం!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : అంతర్జాతీయ ప్రతికూల పవనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ను నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 247 పాయింట్ల నష్టంతో 65,629 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 46 పాయింట్ల లాస్‌తో 19,624 వద్ద ముగిసింది. ఇక 134 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్ నిఫ్టీ 43,754 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో వీక్నెస్ కనిపిస్తోంది.
"19,480- 19,450 లెవల్స్ కీలకమైన సపోర్ట్‌గా ఉన్నాయి. ఇక్క సపోర్ట్ లభిస్తే.. మార్కెట్ పెరగొచ్చు. కాగా.. 19,700 కలక రెసిస్టెన్స్‌గా ఉంది. 19,850 లెవల్స్ దాటితేనే.. నిఫ్టీలో పాజిటివ్ ఔట్లుక్ కనిపించొచ్చు," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market news today : గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1093.47 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 736.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ సూచీలు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ.. దాదాపు 150 పాయింట్ల లాస్లో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా సూచీలు గురువారం కూడా నష్టపోయాయి. డౌ జోన్స్ 0.7శాతం, నాస్డాక్ 0.96శాతం, ఎస్ అండ్ పీ 00 0.85శాతం మేర నష్టపోయాయి.
స్టాక్స్ టు బై..
Lupin share price target : లుపిన్:- బై రూ. 1200, స్టాప్ లాస్ రూ. 1175, టార్గెట్ రూ. 1254
బీఎస్ఈ:- బై రూ. 1357.6, స్టాప్ లాస్ రూ. 1465, టార్గెట్ రూ. 1697
ఆదిత్య బిర్లా క్యాపిటల్:- బై రూ. 183, స్టాప్ లాస్ రూ. 178, టార్గెట్ రూ. 189
పరాస్ డిఫెన్స్:- బై రూ. 742, స్టాప్ లాస్ రూ. 730, టార్గెట్ రూ. 760
టాటా ఎలెక్సీ:- బై రూ. 7704, స్టాప్ లాస్ రూ. 7550, టార్గెట్ రూ. 8012
Mind corp share price target : మిండా కార్ప్:- బై రూ. 363.65, స్టాప్ లాస్ రూ. 352, టార్గెట్ రూ. 387
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం