Budget Phones : మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లో స్మార్ట్‌ ఫోన్స్.. 108 ఎంపీ అదిరిపోయే కెమెరా-smartphones under middle class budget most affordable smartphones with 108mp main camera without offer know in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget Phones : మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లో స్మార్ట్‌ ఫోన్స్.. 108 ఎంపీ అదిరిపోయే కెమెరా

Budget Phones : మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లో స్మార్ట్‌ ఫోన్స్.. 108 ఎంపీ అదిరిపోయే కెమెరా

Anand Sai HT Telugu
Aug 25, 2024 04:01 PM IST

Budget Phones : తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి అనుకునేవారికి గుడ్ న్యూస్. మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలో ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ఫీచర్లు కూడా అద్భుతంగా ఉంటాయి. కెమెరా క్వాలిటీ, ర్యామ్ కూడా ఎక్కువే ఉంటుంది. అలాంటి ఫోన్లు ఏమున్నాయో చూద్దాం..

బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్స్
బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్స్

మీరు తక్కువ ధరలో ఉత్తమ కెమెరా స్పెసిఫికేషన్ కలిగిన ఫోన్ కొనాలి అనుకుంటే శుభవార్త. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ మీకు కొన్ని ఉత్తమ ఎంపికలు అందిస్తున్నాయి. ఈ ప్లాట్‌‍ఫామ్‌లో 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో టాప్ 3 స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.. ప్రత్యేకత ఏంటంటే ఈ డివైజ్‌లు ఎలాంటి ఆఫర్ లేకుండా చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ ఫోన్లలో 16 జీబీ వరకు ర్యామ్, భారీ రియర్ కెమెరా లభిస్తుంది. ఇందులో 9 వేల కంటే తక్కువ ధరలో కూడా ఫోన్ ఉంది.

ఐటెల్ ఎస్ 24

108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా అమెజాన్ ఇండియాలో రూ .8,999 కు లభిస్తుంది. ఈ ఫోన్‌లో 16 జీబీ వరకు ర్యామ్ విత్ మెమొరీ ఫ్యూజన్ ఫీచర్‌ను కంపెనీ అందిస్తోంది. ఇందులో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. ప్రాసెసర్‌గా ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ91 చిప్ సెట్‌ను చూడొచ్చు. 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కంపెనీ అందిస్తోంది. బలమైన సౌండ్ కోసం డ్యూయల్ డీటీఎస్ స్పీకర్లు ఉన్నాయి.

పోకో ఎక్స్6 నియో 5జీ

8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. ఈ ఫోన్లో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. దీంతోపాటు ఫోన్ వెనుక భాగంలో 2 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఫోన్ సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్. పోకోకు చెందిన ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ సెట్‌పై పనిచేస్తుంది. ఫోన్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్, ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. అమెజాన్ ఇండియా నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

రియల్ మీ సీ53

ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,999గా ఉంది. ఫోన్ వెనుక భాగంలో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను కంపెనీ అందిస్తోంది. సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్. రియల్ మీ ఈ ఫోన్ లో 6.74 అంగుళాల డిస్‌ప్లేను అందించనుంది. ప్రాసెసర్‌గా యూనిసోక్ టీ612 అనే కంపెనీ ఇందులో కనిపించనుంది. ఫోన్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్, ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.