Smartphones: రూ. 25 వేల లోపు ధరలో ఈ రెండు ఫోన్స్ లో ఏది బెటరో తెలుసుకోండి!
మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లలో రూ. 25 వేల లోపు ధరలో లభించే సెగ్మెంట్ ఒకటి. ఈ ప్రీమియ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో లేటెస్ట్ గా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్ ఒప్పో ఎఫ్ 27 5 జీ,మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్. ఈ రెండు ఫోన్స్ లో పవర్, ఫీచర్స్, ధర పరంగా ఏది బెటరో తెలుసుకుందాం..
ఒప్పో ఇటీవల కొన్నిఅడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో ఒప్పో ఎఫ్ 27 5 జీని లాంచ్ చేసింది. ప్రీమియ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రకటించారు. ఈ సెగ్మెంట్లో ఇప్పటికే నథింగ్ ఫోన్ 2ఎ, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ వంటి ఫీచర్లతో నిండిన స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి. అందువల్ల, ఈ సెగ్మెంట్లో మీకు బెస్ట్ ఫోన్ అందించే ఉద్దేశంతో ఒప్పో ఎఫ్ 27 5 జీ, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ల మధ్య స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ను పోల్చి చూశాం.
ఒప్పో ఎఫ్ 27 5 జి వర్సెస్ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్:
డిజైన్ మరియు డిస్ ప్లే: ఒప్పో ఎఫ్ 27 5 జీ గ్లాసీ బ్యాక్ ప్యానెల్, సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తో వస్తుంది. ఇది మరింత రిఫైన్డ్ లుక్ ను ఇస్తుంది. మ్యూజిక్ తో సింక్ అయ్యే హాలో లైట్ కూడా ఇందులో ఉంది . రక్షణ కోసం, ఒప్పో ఎఫ్ 27 5 జీ స్మార్ట్ ఫోన్ ను ఆర్మర్ బాడీతో రూపొందించారు. డస్ట్ అండ్ స్ప్లాష్ రక్షణ కోసం ఇది ఐపి 64 రేటింగ్ పొందింది. మరోవైపు, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ సిలికాన్ బ్యాక్ ప్యానెల్ తో చాలా మినిమలిస్టిక్ డిజైన్ ను కలిగి ఉంది. అయితే ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కారణంగా ఈ స్మార్ట్ ఫోన్ మరింత మన్నికైనదిగా మారింది. డిస్ ప్లే విషయానికొస్తే ఒప్పో ఎఫ్ 27 5జీ లో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2100 అంగుళాల పీక్ బ్రైట్ నెస్ ఉన్నాయి. మరోవైపు మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.67 అంగుళాల కర్వ్డ్ పోఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది.
కెమెరా
ఒప్పో ఎఫ్ 27 5 జీలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సిస్టమ్, శాంసంగ్ ఓమ్నీవిజన్ ఓవి 50 డి సెన్సార్, 2 ఎంపి పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ముందువైపు సోనీ ఐఎంఎక్స్ 615 సెన్సార్ తో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు . మరోవైపు, మోటరోలా (Motorola) ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ లైటియా 700 సి సెన్సార్, 3 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. దీంతోపాటు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా ఇందులో అందించారు.
పర్పార్మెన్స్
ఒప్పో ఎఫ్27 5జీలో LPDDR4X ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్ ఉంది. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్ వోసీ, LPDDR4X ర్యామ్, యూఎఫ్ ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఇది ఒప్పో (OPPO) స్మార్ట్ ఫోన్ కంటే శక్తివంతమైనది.
బ్యాటరీ
ఒప్పో ఎఫ్ 27 5జీ (Oppo F27 5G) ఫ్యూజన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion) లో కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 68 వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది .
ధర
ఒప్పో ఎఫ్ 27 5జీ, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ రెండూ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ప్రారంభ ధర రూ . 22,999గా ఉంది.