Samsung Galaxy S25 launch: శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ లాంచ్ డేట్ లీక్ అయింది.. లాంచ్ ఎప్పుడంటే?
Samsung Galaxy S25 launch: శాంసంగ్ అభిమానులు ప్రతీ సంవత్సరం ఆసక్తిగా ఎదురు చూసే ఈవెంట్ శాంసంగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ లాంచ్ ఈవెంట్. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 లాంచ్ ఈవెంట్ తేదీ లేటెస్ట్ గా లీక్ అయింది. ఆ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Samsung Galaxy S25 launch: గత కొన్ని నెలలుగా రాబోయే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ గురించి అనేక లీకులు, పుకార్లు వింటున్నాము. కొత్త తరం శాంసంగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఎలా ఉంటుందనే దానిపై వివిధ రకాల అంచనాలు వెలువడుతున్నాయి. అయితే, లేటెస్ట్ గా ఒక ఎక్స్ యూజర్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ లాంచ్ డేట్ గురించి ఒక లీక్ ను వదిలాడు.
శాంసంగ్ సర్వే ప్రకారం..
ఇటీవల జరిగిన ఒక శాంసంగ్ సర్వేలో.. గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ప్రీ-ఆర్డర్ తేదీని 2025 జనవరి 5వ తేదీగా పేర్కొన్నారు. అంటే, సాధారణంగా ప్రీ ఆర్డర్ తేదీ కన్నా కొన్ని రోజుల ముందు లాంచ్ ఉంటుంది. అంటే, జనవరి 5వ తేదీకి కొన్ని రోజుల ముందు గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ ఉండవచ్చని ఆ ఎక్స్ యూజర్ వెల్లడించాడు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ లాంచ్ డేట్
ఐఎమ్ ఇఐ ఫామ్ అనే ఎక్స్ యూజర్ రాబోయే గెలాక్సీ ఎస్ 25 సిరీస్ ప్రీ-ఆర్డర్ తేదీని హైలైట్ చేసే శాంసంగ్ సర్వేను వెల్లడిస్తూ ఒక పోస్ట్ ను పంచుకున్నాడు. గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కోసం జనవరి 5 నుంచి ప్రి ఆర్డర్ చేసుకోవచ్చని శాంసంగ్ సర్వేలో పేర్కొన్న విషయాన్ని ఆ యూజర్ వెల్లడించాడు. అయితే, దీనిపై శాంసంగ్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ విడుదల కాలేదు. అందువల్ల, ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు.
2024 లో జనవరి 17న లాంచ్
2024లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 సిరీస్ ను జనవరి 17న లాంచ్ చేసింది. అయితే టెక్ దిగ్గజం శాంసంగ్ (samsung) తన ఫోల్డబుల్ ను అనుకున్న దానికంటే కొంచెం ముందుగానే లాంచ్ చేసింది. అందువల్ల శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ ను ఊహించిన దానికంటే ముందుగానే లాంచ్ చేయాలని యోచిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ లో మూడు మోడళ్లు ఉంటాయని భావిస్తున్నారు. అవి గెలాక్సీ ఎస్ 25, గెలాక్సీ ఎస్ 25 ప్లస్, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా. గెలాక్సీ ఎస్ 25 స్లిమ్ గురించి కూడా పుకార్లు ఉన్నాయి. అయితే ఇది ఏప్రిల్ 2025 వరకు లాంచ్ అయ్యే అవకాశం లేదు. గెలాక్సీ ఎస్ 25 సిరీస్ ఎక్సినోస్ 2500 లేదా క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ తో పనిచేస్తుందని పుకార్లు సూచిస్తున్నాయి. గెలాక్సీ ఎస్ 25 మరియు గెలాక్సీ ఎస్ 25 ప్లస్ స్వల్ప అప్ గ్రేడ్ లకు సిద్ధంగా ఉన్నాయి. గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా కెమెరా, పనితీరు పరంగా కొత్త ఫీచర్లతో కొన్ని ప్రధాన అప్ గ్రేడ్ లను పొందుతుందని భావిస్తున్నారు. అదనంగా, అల్ట్రా వేరియంట్ బరువును తగ్గించే కొన్ని డిజైన్ మెరుగుదలలను కూడా ఈ స్మార్ట్ ఫోన్ (smartphones) లో ఉండవచ్చు.