Samsung Galaxy Discount : శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై భారీ ఆఫర్.. లాంచ్ ధర కంటే చాలా తక్కువలో-samsung galaxy s24 5g gets huge discount check available price and features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy Discount : శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై భారీ ఆఫర్.. లాంచ్ ధర కంటే చాలా తక్కువలో

Samsung Galaxy Discount : శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై భారీ ఆఫర్.. లాంచ్ ధర కంటే చాలా తక్కువలో

Anand Sai HT Telugu

Samsung Galaxy Discount : శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 లాంచ్ ధర కంటే రూ.15,000 తక్కువగా లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీని ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

శాంసంగ్ గెలాక్సీ ఎస్24

మీరు శాంసంగ్ ఫోన్ కొనాలనుకుంటే ఇదే మంచి అవకాసం. ఎందుకంటే శాంసంగ్ ఫోన్లపై మంచి డిస్కౌంట్ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవల్ సేల్‌ మీకోసం మంచి డీల్ అందిస్తోంది. ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 లాంచ్ ధర కంటే తక్కువగా లభిస్తుంది. వాస్తవానికి ఈ ఫోన్ బేస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లాంచ్ ధర కంటే ఫ్లాట్ రూ.14,000 తక్కువగా లభిస్తోంది. అంతే కాదు, ఫోన్లో అందుబాటులో ఉన్న బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు దాని ధరను మరింత తగ్గించవచ్చు. ఈ డీల్ గురించి వివరంగా చూద్దాం..

లాంచ్ ధర కంటే తక్కువకే

లాంచ్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 128 జీబీ వేరియంట్ ధర రూ.74,999, 256 జీబీ వేరియంట్ ధర రూ.79,999, 512 జీబీ వేరియంట్ ధర రూ.89,999గా ఉండేగి. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్‌లో ఈ ఫోన్ 128 జీబీ వేరియంట్ నేరుగా రూ .59,999(మార్బుల్ గ్రే) అంటే లాంచ్ ధర కంటే ఫ్లాట్ రూ .15,000 తక్కువ. ఫోన్ పై ఎక్స్ ఛేంజ్ బోనస్ లేదు, కానీ బ్యాంక్ ఆఫర్లు చాలా ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని దాని ధరను మరింత తగ్గించవచ్చు.

ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 5జీ బేసిక్ స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాం. ఈ ఫోన్‌లో అమోఎల్ఈడీ డిస్‌ప్లే, ఏఐ ఫీచర్స్ ఉంటాయి. 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ ఎమోలేజ్ 2ఎక్స్ స్క్రీన్‌ను అందించారు. స్క్రీన్‌లో విజన్ బూస్టర్ సపోర్ట్ కూడా ఉంది. భారతదేశంలో ఈ ఫోన్ ఎక్సినోస్ 2400 చిప్‌సెట్‌తో వస్తుంది. చాలా దేశాలలో ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్లో 8 జీబీ ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. ఈ ఫోన్లో గెలాక్సీ ఏఐ ఫీచర్లకు సపోర్ట్ కూడా ఉంది.

50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌తో ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియోల కోసం ఫోన్లో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 25వాట్ వైర్డ్ ఛార్జింగ్, 15వాట్ వైర్లెస్ ఛార్జింగ్‌తో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. దుమ్ము, నీటి నుంచి సురక్షితంగా ఉండేందుకు ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్‌తో వస్తుంది.