తెలుగు న్యూస్ / ఫోటో /
iPhone SE4: ఐఫోన్ ఎస్‍ఈ 4 లాంచ్ అయ్యేది అప్పుడే! అప్‍గ్రేడ్స్ ఎలా ఉండొచ్చంటే..
iPhone SE4: ఐఫోన్ ఎస్ఈ 4 కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. గత మోడల్‍తో పోలిస్తే చాలా అప్‍గ్రేడ్లతో ఈ మొబైల్ వస్తుందని కూడా రూమర్లు బయటికి వచ్చాయి.
(1 / 5)
యాపిల్ ఎస్ఈ లైనప్‍లో తదుపరి మోడల్‍ను యాపిల్ ఎప్పుడు లాంచ్ చేస్తుందా అనే ఆసక్తి నెలకొంది. వచ్చే ఏడాది 2025 మార్చిలో ‘ఐఫోన్ ఎస్ఈ 4’ను విడుదల చేసేందుకు యాపిల్ రెడీ అవుతోందని రూమర్లు బయటికి వచ్చాయి. 2022లో వచ్చిన గత ఎస్3తో పోలిస్తే నయా మోడల్ కొన్ని అప్‍గ్రేడ్లతో ఉండనుంది. డిజైన్ విషయానికి వస్తే.. ఐఫోన్ ఎస్ఈ4లో మార్పులు ఉంటాయని టిప్‍స్టర్ల నుంచి లీకులు వచ్చాయి. డైనమిక్ ఐలాండ్, యాక్షన్ బటన్ ఉంటాయని అంచనాలు వెల్లడయ్యాయి.(IceUniverse)
(2 / 5)
ఐఫోన్ ఎస్ఈ 4 శక్తివంతమైన ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది గత మోడల్‍తో పోలిస్తే భారీ అప్‍గ్రేడ్‍గా ఉండనుంది. బయోనిక్ ఏ18 ప్రాసెసర్‌ను ఎస్ 4 మొబైల్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. (Ming-Chi Kuo)
(3 / 5)
ఐఫోన్ 16 సిరీస్‍లో ఉన్న యాపిల్ ఇంటెలిజెన్స్.. ఐఫోన్ ఎస్ఈ 4లో కూడా ఉండనుందని లీకులు వచ్చాయి. దీని వల్ల ఏఐకు సంబంధించిన అధునాతన ఫీచర్లు ఫోన్‍లో ఉంటాయి.
(4 / 5)
ఐఫోన్ ఎస్ 4 మొబైల్ 6.1 ఇంచుల ఓఎల్‍ఈడీ డిస్‍ప్లేతో వస్తుందని తెలుస్తోంది. ఎస్ఈ 3లో ఎల్‍సీడీ డిస్‍ప్లే ఉండగా.. ఈ నెక్స్ట్ మోడల్‍లో ఓఎల్‍ఈడీకి అప్‍గ్రేడ్ చేయనుందని సమాచారం. దీంతో ఎస్ఈ 4 మొబైల్.. ఫేస్ ఐడీ లాక్‍కు సపోర్ట్ చేయనుంది. (AppleTrack)
ఇతర గ్యాలరీలు