Samsung new smartphones : సామ్సంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 లాంచ్.. ఫీచర్స్ ఇవే..
Samsung Galaxy A55 launch in India : సామ్సంగ్ గెలాక్సీ ఏ35, సామ్సంగ్ గెలాక్సీ ఏ55 గ్యాడ్జెట్స్‌ని ఇండియాలో లాంచ్ చేసింది సంస్థ. వీటి ఫీచర్స్ ఇక్కడ చూసేయండి..
Samsung Galaxy A55 price in India : నిరీక్షణకు తెరపడింది! ఇండియాలో.. సామ్సంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 స్మార్ట్‌ఫోన్స్‌ని ఎట్టకేలకు ఇండియాలో లాంచ్ చేసింది ఈ దిగ్గజ టెక్ సంస్ధ. మిడ్ రేంజ్ కేటగిరీల్లో చేరిన ఈ స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
సామ్సంగ్ గెలాక్సీ ఏ55 5జీ స్పెసిఫికేషన్స్..
సామ్సంగ్ గెలాక్సీ ఏ55లో.. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. దీనికి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ లభిస్తోంది. గెలాక్సీ ఏ55లో ఇన్-హైస్ ఎక్సినోస్ 1480 ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్స్ ఇందులో ఉన్నాయి. ఇక ఈ సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 6.1 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది.
ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ55లో 50ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రావైడ్, 5ఎంపీ మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తుండటం విశేషం. ఇందులో.. లో- లైట్ ఫొటోగ్రఫీ కోసం ఏఐ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీపై ఇది పనిచేస్తుంది.
సామ్సంగ్ గెలాక్సీ ఏ35 5జీ స్పెసిఫికేషన్స్..
Samsung Galaxy A35 price in India : సామ్సంగ్ గెలాక్సీ ఏ35లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ దీని సొంతం. మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. వి.. 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్. ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 6.1 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది. దీనికి.. నాక్స్ 3.1 ప్రొటెక్షన్ లభిస్తోంది.
ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ35 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రావైడ్, 5ఎంపీ మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ వస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తోంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం.
బడ్జెట్ ఫ్రెండ్లీ సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫీచర్స్..
Samsung Galaxy F15 : సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ స్మార్ట్‌ఫోన్‌పై మంచి బజ్ నెలకొంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్‌ని చెక్ చేశారా? కింద తెలుసుకోండి..
సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 4జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999, 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,499గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్.. మీడియాటెక్ 6100+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్‌పై 4 సంవత్సరాల పాటు ఓఎస్ అప్డేట్స్ని సంస్థ ఇస్తుందట. .5 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎస్‌అమోలెడ్ డిస్ప్లే ఇందులో ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం