Royal Enfield Himalayan 450 : హైదరాబాద్‌లో హిమాలయన్ 450 ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
Royal Enfield Himalayan 450 : రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ కొనాలని చూస్తున్నారా? హైదరాబాద్‌లో ఈ బైక్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Royal Enfield Himalayan 450 on road price Hyderabad : రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్‌ని ఇటీవలే లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఈ మోడల్‌పై బైక్ లవర్స్‌లో ఆసక్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో హిమాలయన్ 450 ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హిమాలయన్ 450 ఆన్‌రోడ్ ప్రైజ్..
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి.. బేస్, పాస్, సమిట్. వీటి ఎక్స్‌షోరూం ధరలు వరుసగా రూ. 2.69లక్షలు, రూ. 2.74లక్షలు, రూ. 2.84లక్షలుగా ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో వీటి ఆన్‌రోడ్ ప్రైజ్‌లు..
- హిమాలయన్ 450 బేస్:- రూ. 3,23,053
- హిమాలయన్ 450 పాస్:- రూ. 3,28,699.
- హిమాలయన్ 450 సమిట్:- రూ. 3,34,345.
Royal Enfield Himalayan 450 price : ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. సంస్థకు చెందిన డీలర్షిప్షోరూమ్స్లో ఈ వెహికిల్‌ని బుక్ చేసుకోవచ్చు. కాగా.. డిసెంబర్ 31 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయని సంస్థ చెప్పింది. ఆ తర్వాత.. బైక్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఇదీ చూడండి:- Royal Enfield Himalayan 450 vs KTM 390 Adventure : ఈ రెండు బైక్స్‌లో ఏది కొనాలి?
రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ విశేషాలు..
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450లో 450సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 450 హెచ్‌పీ పవర్‌ని, 40 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ వెహికిల్ బరువు 196కేజీలు. ఇందులో 17 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. 825ఎంఎం అడ్జెస్టెబుల్ సీట్ హైట్ లభిస్తోంది.
ఇక ఈ కొత్త బైక్‌లో రౌండ్ టీఎఫ్టీ కలర్ స్క్రీన్ వస్తోంది. ఇందులో గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేటెడ్‌గా ఉంటాయి. ఈ స్క్రీన్‌ని స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. కాల్స్, నోటిఫికేషన్స్, ఎస్ఎంఎస్లని యాక్సెస్ చేసుకోవచ్చు. అదనంగా.. రైడ్- బై- వైర్ టెక్నాలజీ, స్విఛ్చెబుల్ ఏబీఎస్, ఫుల్- ఎల్ఈడీ లైటింగ్ వంటివి కూడా ఈ బైక్‌కి వస్తున్నాయి.
Royal Enfield Himalayan 450 price in Hyderabad : రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్‌లో 21/17 ఇంచ్ స్పోక్ వీల్స్ వస్తున్నాయి. సస్పెన్షన్స్ విషయానికొస్తే.. ఫ్రెంట్లో షోవా యూఎస్డీ ఫోర్క్స్, రేర్‌లో మోనో-షాక్ అబ్సార్బర్స్ లభిస్తున్నాయి. ఫ్రెంట్, రేర్ వీల్స్‌కి డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి.
కేటీఎం 390 అడ్వెంచర్, బీఎండబ్ల్యూ జీ310 జీఎస్ వంటి బైక్స్‌కి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త వెహికిల్ గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం