Poco C50 launched: 5000ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో సీ50 ఫోన్ లాంచ్.. ధర రూ.7వేలలోపే..
Poco C50 launched in India: పోకో సీ50 బడ్జెట్ మొబైల్ ఇండియాలో లాంచ్ అయింది. హెచ్‍డీ+ డిస్‍ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో బడ్జెట్ రేంజ్‍లో అందుబాటులోకి వస్తోంది.
Poco C50 launched in India: సి సిరీస్‍లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‍ను పోకో లాంచ్ చేసింది. పోకో సీ50 మొబైల్ ఇండియాలో నేడు (జనవరి 3) విడుదలైంది. వెనుక రెండు కెమెరాల సెటప్, వాటర్ డ్రార్ స్టైల్ నాచ్ డిస్‍ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో పోకో సీ50 వస్తోంది.
పోకో సీ50 ధర, సేల్
Poco C50 Price, Sale: పోకో సీ50 మొబైల్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 2జీబీ ర్యామ్ + 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ ధర రూ.6,499గా ఉంది. 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.7,299గా ఉంది. కంట్రీ గ్రీన్, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో లభించనుంది. ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్‌లో ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది. కాగా, తొలి సేల్ రోజులో స్పెషల్ లాంచ్ డే ప్రైస్ ఉంటుందని ఫ్లిప్‍కార్ట్ పేర్కొంది. అంటే 10వ తేదీన పోకో సీ50 2జీబీ మోడల్ రూ.6,249 ధరకు, 3జీబీ వేరియంట్ రూ.6,999కు అందుబాటులోకి రానున్నాయి.
పోకో సీ50 స్పెసిఫికేషన్లు
Poco C50 Specifications: 6.52 ఇంచుల హెచ్‍డీ+ డిస్‍ప్లేను పోకో సీ50 కలిగి ఉంది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ (Android 12 Go Edition) ఆపరేటింగ్ సిస్టమ్‍ను కలిగి ఉంది. ఈ మొబైల్ వెనుక రెండు కెమెరాల సెటప్ ఉంది. 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో కెమెరా ఉంటాయి. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ నయా పోకో బడ్జెట్ 4జీ ఫోన్ వస్తోంది.
పోకో సీ50 మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. స్టాండర్డ్ 10వాట్ల చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 4జీ ఎల్‍టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్‍బీ పోర్ట్, 3.5mm హెడ్‍ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ వెనుక ఉంటుంది. మొత్తంగా పోకో సీ50 ఫోన్ 192 గ్రాముల బరువు ఉంటుంది.
మొత్తంగా చూస్తే, రెడ్‍మీ ఏ1+ లాంటి స్పెసిఫికేషన్లతోనే పోకో సీ50 వచ్చింది. కాగా, రెడ్‍మీ ఏ1+ ప్రారంభ ధర రూ.6,999గా ఉంది.